pawan kalyan explains janasena principles జనసేన సిద్దాంతాలివే: పవన్

Pawan kalyan explains janasena idealogies at karimnagar

Pawan Kalyan Political Yatra, pawan kalyan janasena, janasena idealogies, pawan explains janasena priniciples, pawan kalyan party activists meet, Pawan fan mets accident, pawan kalyan party co-ordinators meet, Pawan Kalyan Political Journey, Pawan Kalyan Kondagattu Anjaneya Swami Temple, pawan kalyan, janasena, party activists, co-ordinators, nizamabad, adilabad, karimnagar, telangana, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan describes his party janasena ideologies in karimnagar at party coordinators meet in shubham gardens.

జనసేన సిద్దాంతాలు చెప్పిన పవన్ కల్యాన్

Posted: 01/23/2018 12:58 PM IST
Pawan kalyan explains janasena idealogies at karimnagar

జనసేన పార్టీ స్థాపించి.. ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి తొలిసారిగా దిగుతున్న క్రమంలో జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ పార్టీ సిద్దాంతాలను సమన్వయకర్తలకు వివరించారు. కరీంనగర్ లోని శుభం గార్డెన్స్ లో జనసేన పార్టీ సమన్వయకర్తల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ తన పార్టీని ముందుకు నడిపించేందుకు సప్తసిద్దాంతాలు వున్నాయని అన్నారు. అయితే తన సిద్దాంతాలను బలంగా విశ్వసించే యువత తనతో పాటు రెండు, రెండున్నర దశాబ్దాల పాటు పోరాటం చేసేందుకు సిద్దంగా వుండాలని.. తనతో పాటు సుదీర్ఘపోరాటానికి సిద్దం కావాలని పవన్ సమన్వయకర్తలకు పిలుపునిచ్చారు. అయితే సమన్వయకర్తలకు, వారి సమస్యలకు తాను అండగా నిలుస్తానని అన్నారు.

* కులాలను కలిపే అలోచనా విధానం..
* మతాల ప్రస్తావన లేని సమాజ స్థాపన
* బాష, సంస్కృతులను కలిపే సంప్రదాయం
* అందరికీ అహార భద్రత
* అవినీతి, అక్రమాలు లేని సమాజం
* ప్రాంతీయతలను విస్మరించే జాతీయవాదం
* పర్యావరణాన్ని పరిరక్షణ కోసం పరితపించే నవసమాజం..

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ అలోచనా విధానం తన అలోచనా విధానానికి దగ్గరగా వుంటుందని పవన్ కల్యాన్ అన్నారు. అందుకు కారణం తాను ఎక్కువగా పెరిగింది తెలంగాణలోనేని తెలిపారు. తెలంగాణ అంటే తనకు ప్రాణం, ప్రేమ అని చెప్పుకోచ్చారు. తన సినిమాలలో కూడా తెలంగాణ యాసను బాషను, పండుగలను ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించానని, అభిమానులు తన చిత్రాలను ఓసారి పరిశీలించాలని కూడా చెప్పారు. జానీ చిత్రంతో సదర్ ఉత్సవానికి చిత్రీకరించామన్నారు. అలానే బతుకమ్మ పండగ, సమ్మక్క సారలమ్మల జాతర, గ్రామ దేవతల బోనాలు లాంటి వేడుకల తెలంగాణ ఉద్యమంలో తెలంగాణవాసులందరినీ ఐక్యం చేశాయని చెప్పారు. అయితే తాను విశాలమైన జాతీయవాదినని, తనకు దేశమే ముఖ్యమని అన్నారు. దేశం కోసం తన గుండె కొట్టుకుంటుందని, తెలంగాణ కోసం కావాలంటే తన రక్తమిస్తానని కూడా చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  principles  party activists  jai telangana  co-ordinators  telangana  politics  

Other Articles