Pawan Kalyan to start his visit to kondagattu temple కోలాహలంగా మారిన జనసేన కార్యాలయం..

Pawan kalyan to start his visit to kondagattu temple with fans

Pawan Kalyan Political Yatra, Pawan Kalyan Political Journey, Pawan Kalyan Kondagattu Anjaneya Swami Temple, pawan kalyan, janasena, pawan kalyan fans, pawan kalyan followers, kondagattu, anjaneya swamy temple, karimnagar, telangana, andhra pradesh, politics

Actor turned politician, Jana sena chief power star pawan kalyan start his to kondagattu Hanuman Temple in Karimnagar within a few minutes as a part of it a his fans and followers crowded at jana sena office.

కోలాహలంగా మారిన జనసేన కార్యాలయం.. కాసేపట్లో కొండగట్టుకు పవన్

Posted: 01/22/2018 08:46 AM IST
Pawan kalyan to start his visit to kondagattu temple with fans

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజనేయ స్వామి అలయ దర్శనానికి మరికొద్ది సేపట్లో బయలుదేరేందుకు సిద్దమయ్యారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు చేరుకుని అక్కడ స్వామివారి దర్శనాన్ని చేయనున్నారు. ఆ తరువాత ఆయన తన నిర్విరామ పార్టీ యాత్ర కార్యచరణను ప్రకటించనున్నారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం పవన్ కల్యాన్ తన ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు.

ఈ క్రమంలో ఇవాళ ఆయన మొదట తన ఇంటి నుంచి హైదరాబాదులోని తన జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కొండగట్టుకు బయలుదేరారు. ఇంటి నుంచి బయలుదేరే సమయంలో ఆయన సతీమణి లెజినోవా ఎదురొచ్చి హారతి ఇచ్చారు. కొండగట్టులో ఆంజనేయస్వామి దర్శనం అనంతరం కరీంనగర్ చేరుకుంటారు. అక్కడ జనసేన ముఖ్య నాయకులతో భేటీ అవుతారు.

కోలాహలంగా పార్టీ కార్యాలయం..

ఈ నేపథ్యంలో పవన్ కల్యాన్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలతో హైదరాబాదులోని జనసేన కార్యాలయం సహా ఆయా ప్రాంగణాలన్నీ కొలాహలంగా మారిపోయాయి. పవన్ కల్యాన్ ప్రకటన నేపథ్యంలో అదివారం సాయంత్రం నుంచే అభిమానులు పెద్ద ఎత్తున ఆయన కార్యాలయానికి చేరుకున్నారు. ఇక ఇవాళ ఉదయానికి జనసేన కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో అభిమానులు గుమ్మిగూడి ఆయనతో పాటుగా నడిచేందుకు సిద్దయమయ్యారు. దీంతో పార్టీ పరిసరాల్లో కాసింత ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తింది. అభిమానులతో పాటు కలసి పవన్ కల్యాన్ మరికాసేపట్లో కొండగట్టుకు బయటుదేరనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  kondagattu  anjaneya swamy temple  karimnagar  telangana  andhra pradesh  politics  

Other Articles