Jignesh plans alliance for community upliftment తెలంగాణలో రాజ్యమేలుతున్న పోలీసు పెత్తనం..

Jignesh mevani demands 5 acre land for each dalit

jignesh mevani, jignesh mevani demands land for dalits, dalit alliance, manda krishna madiga, jignesh mevani manda krishna madiga, jignesh mevani dalit alliance, rohith vemula, rohith vemula death, politics

Gujarat MLA Jignesh Mevani visited Manda Krishna Madiga, a Dalit leader who is currently lodged in a prison in Hyderabad

తెలంగాణలో రాజ్యమేలుతున్న పోలీసు పెత్తనం..

Posted: 01/17/2018 07:37 PM IST
Jignesh mevani demands 5 acre land for each dalit

చంచల్ గూడ జైలులో వున్న మాదిగ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను ఇవాళ గుజరాత్ యువనేత, ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ ఈ ఉదయం పరామర్శించారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద అనుమతి లేకుండా నిరసనకు దిగి.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాడన్న కారణంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు, కోర్టు ఆదేశాల మేరకు చంచల్ గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే.

దీంతో ఆయనను పరామర్శించేందుకు గుజరాత్ కు చెందిన యువ దళిత నేత జిగ్నేష్, జైలు అధికారులు, అనుమతితో లోపలికి వెళ్లి సుమారు అరగంట పాటు మంద కృష్ణతో మాట్లాడి బయటకు వచ్చారు. ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జిగ్నేష్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ పడి విజయం సాధించిన విషయం తెలిసిందే. జిగ్నేష్ వచ్చారన్న విషయాన్ని తెలుసుకున్న దళిత సంఘాలు పెద్దఎత్తున జైలు వద్దకు రావడంతో సందడి వాతావరణం నెలకొంది.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన హక్కుల కోసం పోరాడే మందకృష్ణ మాదిగను జైల్లో పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్దమని అన్నారు. తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన తీవ్ర స్థాయికి చేరుకుందని, నిర్భందం నుంచి ఉద్యమం మరింత ఉవ్వెత్తున ఎగసి పడుతుందన్నారు. దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న హింసకు కేంద్ర ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదన్నారు. దళితుల ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా తీసుకువెళ్తామన్నారు. తెలంగాణలో దళిత సంఘాలన్నీ ఏకం కావాలని జిగ్నేష్ పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jignesh mevani  manda krishna madiga  gujarat dalit mla  dalit alliance  politics  

Other Articles