lady editor and scribes booked for demand bribe | వార్త రాయకుండా ఉండేందుకు లంచం లేడీ ఎడిటర్ ... సీసీ కెమెరాలతో బుక్ చేసిన యువకులు!

Case filled on lady editor and scribes demand bribe

journos booked for blackmailing, scribes bribe, journos bribe, journos blackmailing, scibes blackmailing, lady editor, online business, scribes, kamili, tenali, andhra pradesh, crime

Tenali police filled a case against a lady editor and scribes for demand bribe to stop publishing an item.

కలానికి బేరం.. అమ్మకానికి సత్యాన్వేషి.. అడ్డంగా దొరికి..

Posted: 01/17/2018 10:32 AM IST
Case filled on lady editor and scribes demand bribe

రవికానని, నిషీధిలోని నిజాలను కూడా ప్రజల ముందుకు తీసుకువచ్చేవాడు జర్నలిస్టు. అది నుంచి నేటి వరకు ఎన్నో సత్యాసత్యాలను ప్రజల ముంగిటకు తీసుకువచ్చి.. ఎవరికీ తలవంచకుండా, ఎవరికీ బెదరకుండా, దేనికి అశించకుండా, అవసరమైన నేపథ్యంతో తన ప్రాణాలను కూడా త్యజించే సత్యాన్వేషి జర్నలిస్టు. అలాంటి జర్నలిజానికి కొందరు నకిలీలు పుట్టుకోచ్చి.. తమ స్వార్థం కోసం, తమ లాభాపేక్ష కోసం బ్లాక్ మెయిలింగ్ ఇజానికి తెరతీస్తున్నారు. పవిత్రమైన వృత్తికి కళంకాన్ని తీసుకువచ్చేలా వ్యవహరిస్తున్నారు.  

తాజాగా జరిగిన ఓ ఘటన మీడియా పేరుతో స్వార్థపూరితంగా వ్యవహరించే సత్యాన్వేషిలు అమ్మకాలకు సిద్దమవుతున్నారని, వారి కలానికి కూడా బేరాన్ని పెడుతున్నారని తేటతెల్లం అయ్యింది. ఓ పత్రిక ఎడిటర్ సహా మరో ముగ్గురు తమ వ్యాపారాలను టార్గెట్ చేసి బ్లాక్ మెయిలింగ్ చేయడంతో.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువ వ్యాపారవేత్తలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వారి ఆటను కట్టించారు.

కొందరు యువకులు గ్రూపుగా ఏర్పడి, పలు రకాల ప్రొడక్టులను ఆన్‌ లైన్‌ ద్వారా క్రయ విక్రయాలు చేస్తూ అర్డర్ చేసిన వారికి సరుకులను అందిస్తూ స్టార్టప్ ను ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న వార్తా పత్రిక 'కమిలి' రిపోర్టర్ కృష్ణారావు యువ వ్యాపారవేత్తలపై బెదిరింపులకు దిగాడు. అంతటితో అగకుండా వెంటనే తమతో వ్యవహారాన్ని ముగించుకోవాలని కూడా సూచించాడు. దీంతో కృష్ణారావుతో పాటు పత్రిక సంపాదకురాలు మండవ సౌజన్య, విలేకరులు అప్పికొండ ప్రసాద్‌, దేవవరపు నరేష్ బాబులు కూడా రంగంలోకి దిగారు.

ప్రధాని పిలుపు మేరకు స్టార్టప్ వ్యాపారాన్ని ప్రారంభించి తమ కాళ్లపై తాము నిలబడాలని యోచిస్తే.. తమకు ఏర్పడిన విఘాతం చూసి బిత్తరపోయిన యువకులు.. పాత్రికేయుల ముసుగులో వున్న బ్లాక్ మెయిలర్ల ఆట కట్టించాలని వారితో చర్చలకు పిలిచారు. అయితే చర్చల సందర్బంగా ఏర్పాటు చేసిన గదిలో అప్పటికే రహస్య కెమెరాలను ఏర్పాటు చేసి.. వారు తమతో మాట్లాడింన విషయాలన్నింటినీ రికార్డ్ చేశారు. వాటిని స్థానిక పోలీసులకు ఇచ్చి పిర్యాదు చేశారు.

దీంతో ఎడిటర్ సౌజన్యతో పాటు ముగ్గురు పాత్రికేయులపై కేసు నమోదు చేసిన పోలీసులు సాక్షాలను కూడా పరిశీలించారు. వ్యాపారవేత్తలు ఇచ్చిన సిడీలలో లేడి ఎడిటర్ సౌజన్య వారితో చర్చిస్తూ, ఆన్‌ లైన్‌ ట్రేడింగ్‌ కు చేయాలంటే భారీగా జీఎస్టీ కట్టాల్సి వస్తుందని, విషయమంతా తమ పత్రికలో రాస్తే, కోటి రూపాయలు ప్రభుత్వానికి కట్టాల్సి వుంటుందని, తమకు రూ. 40 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసి చివరకు రూ. 20 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు స్పష్టంగా రికార్డయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lady editor  online business  scribes  kamili  tenali  andhra pradesh  crime  

Other Articles