Bihar: Stones hurled at CM's cavalcade ముఖ్యమంత్రికి పరాభవం.. కాన్వాయ్ పై రాళ్ల దాడి..

Stones hurled at nitish kumar s cavalcade cm safe

nitish kumar, nitish kumar convoy, nitish kumar convoy attacked, nitish kumar convoy stones pelted, nitish kumar buxar, bihar cm nitish kumar convoy

Bihar Chief Minister Nitish Kumar's convoy was attacked today in Buxar. Stones were pelted at his car during a 'samiksha yatra' in Buxar's Nandan.

ముఖ్యమంత్రికి పరాభవం.. కాన్వాయ్ పై రాళ్ల దాడి..

Posted: 01/12/2018 06:14 PM IST
Stones hurled at nitish kumar s cavalcade cm safe

సొంత రాష్ట్ర పర్యటనలో ముఖ్యమంత్రికి పరాభవం ఎదురైంది. రాష్ట్ర పర్యటనలో ఓ జిల్లాకు వెళ్లిన ముఖ్యమంత్రి కాన్వాయ్ పై గుర్తు తెలియని అగంతకులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ ఎదురైంది. శుక్రవారం బిహార్‌లోని బక్సర్‌ జిల్లాలోని నందన్‌ ప్రాంతానికి వెళ్తుండగా, ఆయన కాన్వాయ్ పై అగంతకులు రాళ్లతో దాడి  చేశారు. జరిగింది. వికాస్‌ సమీక్షా యాత్రలో భాగంగా ఆయన బక్సర్‌ జిల్లాలో పర్యటనకు వెళ్లగా, కాన్వాయ్ లోని ఓ వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.

ఈ దాడిలో ఆయన కాన్వాయ్ లోని భద్రతా సిబ్బంది కొందరు గాయపడ్డారు. అయితే ఈ దాడి నుంచి నితీశ్‌ సురక్షితంగా బయటపడ్డారని భద్రతాసిబ్బంది తెలిపారు. వికాస్ సమీక్షా యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దమ్రోన్‌ గ్రామంలో ఒక బహిరంగ సభకు హాజరయ్యే క్రమంలో ఈ దాడి జరుగగా, ఆయన ఈ దాడిపై స్పందిస్తూ.. రాష్ట్రాభివృద్ధి విషయంలో తన నిబద్ధతపై గిట్టని వారు ఇలా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, అలాంటి చిన్న చిన్న విషయాలకు ప్రజలు తమ సహనాన్ని కోల్పోకూడదన్నారు.

తనపై ఎవరు, ఎందుకు రాళ్లతో దాడి చేశారో ప్రస్తుతానికి తెలియదన్నారు. ‘రాష్ట్ర రాజధానిలో కూర్చొని ప్రజలను పాలించేందుకు కాదు నేనున్నది. రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో సైతం పర్యటించి అక్కడి ప్రజలకు శుద్ధ నీరు, విద్యుత్తు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా శ్రమించడమే నా కర్తవ్యం. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించినంత మాత్రాన నా ఆశయాన్ని నీరుగార్చలేరు’ అని నితీశ్‌ అన్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును సమీక్షించేందుకు వికాస్‌ సమీక్షా యాత్ర పేరుతో రాష్ట్రమంతా డిసెంబరు 12 నుంచి ఆయన పర్యటిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nitish kumar  convoy  stones pelted  miscreants  buxar  bihar  

Other Articles