Malaysia to pay US firm up to $70M if it finds missing plane ఏవియేషన్ మిస్టరిని చేధించడానికి మరో అన్వేషణ

Another search begins for long missing malaysian airliner

Malaysia government,US,World News,Malaysia Airlines,Flight MH370,MH370

The government of Malaysia and an American ocean exploration company began a new effort on Wednesday to solve one of history's greatest aviation mysteries: the disappearance of Malaysia Airlines Flight 370 nearly four years ago.

ఏవియేషన్ మిస్టరిని చేధించడానికి మరో అన్వేషణ

Posted: 01/11/2018 01:07 PM IST
Another search begins for long missing malaysian airliner

దాదాపుగా ఐదేళ్ల క్రితం అదృశ్యమైన ఎంహెచ్ 370 విమానం ఏమైంది.? ఐదేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఆ విమానం శఖాలాలైనా ఎక్కడా కనిపించలేదు. అందులో ప్రయాణించిన ప్రయాణికుల యోగక్షేమాలు కూడా ఇప్పటివరకు తెలియరాలేదు. అయితే ఆ విమానంలో ప్రయాణించిన తమవారు క్షేమంగానే వున్నారా.? లేక స్వర్గస్థులయ్యారా..? క్లారిటీ కావాలంటూ ప్రయాణికుల కుటుంబసభ్యులు మలేషియా ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి తీసుకువస్తున్నారు.

ఒకటి రెండు ఇలా ఏళ్ల గడిచేకొద్ది అదృశ్యమైన విమానం గురించి కూడా వెతకడాన్ని నిలిపేసింది మలేషియా ప్రభుత్వం. విమానం కోసం అన్ని రకాలుగా గాలింపు చర్యలు చేపట్టినా.. ఎక్కడికి వెళ్లిందన్న విషయం మాత్రం ప్రపంచంలోనే అతిపెద్ద ఏవియేషన్ మిస్టరీగా మిగిలిపోయింది. మలేషియా సహా పలు దేశాలు విమానం కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గాలింపును నిలిపివేశారు. అయితే ప్రయాణికుల బంధువుల ఒత్తిడి నేపథ్యంలో తాజాగా మలేషియా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. దీనిని విమాన ప్రయాణికుల కుటుంబ సభ్యులు స్వాగతిస్తున్నారు.

అదేంటంటే.. సరిగ్గా మార్చి 2014లో 239 మంది ప్రయాణికులతో వెళ్తూ అదృశ్యమైన మలేషియాకు చెందిన ఎంహెచ్‌ 370  విమానం ఆచూకీని కనిపెట్టేందుకు అమెరికా కంపెనీతో మలేషియా ప్రభుత్వం  భారీ డీల్ కుదుర్చుకుంది. విమానం ఆచూకీని గుర్తిస్తే ఏకంగా 70 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 445 కోట్లు) ఇచ్చేందుకు ముందుకొచ్చింది. గతంలో ఆస్ట్రేలియా కంపెనీ ఒకటి విమానం ఆచూకీని గుర్తించేందుకు ముందుకొచ్చినా ఫలితం లేకుండా పోయింది. విమాన శకలాలను గుర్తించడంలో సదరు కంపెనీ విఫలమైంది. దీంతో గతేడాది జనవరిలో వెతకడం ఆపేశారు.

తాజాగా విమాన శకలాలను గుర్తిస్తే భారీగా నగదు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అయితే, విమాన ఆచూకీని గుర్తించడంలో విఫలమైతే మాత్రం పైసా కూడా ఇచ్చేది లేదని పేర్కొంది. ప్రభుత్వ ఆఫర్‌కు స్పందించిన అమెరికా కంపెనీ విమాన శకలాలను వెతికేందుకు ముందుకొచ్చింది. దక్షిణ హిందూ మహా సముద్రంలో అత్యాధునిక నౌక ద్వారా విమానాన్ని గుర్తించేందుకు అమెరికా కంపెనీ రంగంలోకి దిగనుంది. ఈ నెల మధ్య నుంచి 90 రోజులపాటు విమాన శకలాల కోసం గాలించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Malaysia government  US  Malaysia Airlines  Flight MH370  MH370  World News  

Other Articles