TDP MP JC Diwakar Reddy hot comments విశాఖకు రైల్వే జోన్ రావాలంటే ఎంపీలతో పనిలేదు.. జేసి హాట్ కామెంట్స్.

Tdp mp jc diwakar reddy hot comments on vishaka railway zone

jc diwakar reddy on railway zone, vishaka raiway zone, Jc satirical comment on railway zone, TDP MP on railway zone, jc diwakar reddy, vishaka raiway zone, satirical comment, TDP MP, chandrababu, PM Modi

TDP MP JC Diwakar Reddy once again made hot comments on the burning issue, says tdp mps had nothing to do with vishaka railway zone, expect lifting hand when needed in a meeting with railway officials.

విశాఖకు రైల్వే జోన్ రావాలంటే ఎంపీలతో పనిలేదు.. జేసి హాట్ కామెంట్స్.

Posted: 01/09/2018 12:25 PM IST
Tdp mp jc diwakar reddy hot comments on vishaka railway zone

లోక్ సభలో పార్లమెంటు సభ్యులు కరివేపాకుల్లా మారారని గతంలోనే తన అవేదనను వ్యక్తం చేసిన అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి పదవులను వెలగబెట్టడంపై హాట్ కామెంట్స్ చేశారు. పార్లమెంటులో ప్రజాప్రతినిధులుగా వున్న తాము మోడీ ప్రభుత్వంలో చెయెత్తమంటే ఎత్తేందుకు, లేదా దించమంటే దించేందుకు మాత్రమే తాము వినియోగపడుతున్నాం తప్ప.. ప్రజా ప్రతినిధులుగా ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే వారిని పనులను కూడా చూయలేకపోతున్నామని అభిప్రాయపడ్డారు.

విశాఖపట్నం రైల్వే జోన్ విషయంలో ఎంపీలు చేసేదేమీ లేదని ఆయన నర్మగర్భవాఖ్యలు చేశారు. చెయ్యి ఎత్తమంటే తాము ఎత్తాలని... దించమంటే దించాలని సెటైరిక్ గా కామెంట్ చేశారు. అంతకు మించి తాము చేయగలింది ఏమీ లేదని అన్నారు. విజయవాడలో ఎంపీలతో రైల్వే శాఖ అధికారులు నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ మేరకు స్పందించారు. అదే సమయంలో కేంద్రంలోని మోడీ సర్కారుపై ఆయన పరోక్ష విమర్శలను సంధించారు.

రైల్వే జోన్ పై చెప్పాల్సింది ప్రధాని మోదీయేనన్న ఆయన..కేంద్రంలోని ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ రావడంతో.. వారు తమను వాడుకుని వదిలేస్తున్నారన్న పరోక్షంగా సన్నాయి నోక్కులు నోక్కారు. మనిషికి కొంచెం భయం ఉంటేనే అన్నీ వస్తాయని... భయం లేకపోతే ఆ వ్యక్తిలో విచ్చలవిడితనం పెరిగిపోతుందని విమర్శించారు. అవసరాన్ని బట్టే ముఖ్యమంత్రి చంద్రబాబుకు మోదీ అపాయింట్ మెంట్ ఇస్తున్నారని... ఇది సరైన విధానం కాదని మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jc diwakar reddy  vishaka raiway zone  satirical comment  TDP MP  chandrababu  PM Modi  

Other Articles