Ala “mutton soup” murder, man killed by wife, 'lover' అంతా కార్తీకే చేశాడు.. కాదు జ్యోతే బలవంత పెట్టింది..

Guilty murder spills beans on wife s supari for man

wife murders husband, wife gives supari for husbands murder, nagaraj murder, jyothi supari murder, kharmanhat murder, lalaguda murder, Hyderabad Police, supari gang, Telangana, andhra prradesh news, India News, Latest News

In yet another case of planned murder of a husband by the wife, the Hyderabad Police stumbled upon a case where one of the supari gang members revealed a ghastly incident.

అంతా కార్తీకే చేశాడు.. కాదు జ్యోతే బలవంత పెట్టింది..

Posted: 01/05/2018 06:03 PM IST
Guilty murder spills beans on wife s supari for man

రంకు నేర్చినమ్మ బొంక నేర్వదా అన్నది పెద్దలు చెప్పిన పాత మాట. అయితే భర్త హత్యకు సుపారీ ఇచ్చిన జ్యోతి మాత్రం.. తనకేమీ తెలియదని అంతా తన ప్రియుడు ప్లాన్ చేశాడని చెప్పింది. సుధాకర్ రెడ్డిని హతమార్చి అతని స్థానంలో తన ప్రియుడ్ని తీసుకువచ్చేందుకు ప్లాన్ చేసిన స్వాతి ఘటనను మరువకముందే.. అదే పాలమూరు జిల్లాకు చెందిన మరో భార్య జ్యోతి కూడా తన భర్త నాగరాజును సుపారీ ఇచ్చి మరీ హతమార్చిన ఘటన వెలుగుచూసిన విషయం తెలిసిందే.

నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ మీడియా ఎదుట ప్రవేశపెట్టగా, జ్యోతి మాట్లాడుతూ తన భర్తను చంపాలని తాను అనుకోలేదని చెప్పింది. తన భర్త విషయంలో తనకేమి తెలియదని చెప్పింది. అయితే తన ప్రియుడు కార్తీక్ చెప్పిన ప్రకారం తాను పాలలో నిద్రమాత్రలు కలిపి తన భర్తకు ఇచ్చానంది. అయితే తన భర్తను చంపేస్తారని తనకు తెలియదని చెప్పింది. అపస్మారక స్థితిలో ఉన్న నా భర్తను ఎక్కడకు తీసుకెళ్తున్నారో చెప్పలేదని చెప్పిన జ్యోతి.. తన భర్త మృతదేహం లభ్యమైందని పోలీసులు ఫోన్‌ చేసి చెప్పిన తర్వాతే తెలిసిందని తెలిపింది.

కాగా, ఈ కేసులో నిందితుడు కార్తీక్ భిన్నవాదనలు వినిపించాడు.. నాగరాజు భార్య జ్యోతి ఒత్తిడి చేయడం వల్లే నాగరాజును చంపామని కార్తీక్ వెల్లడించాడు. ‘డిసెంబర్‌ 30న పదేపదే ఫోన్లు చేసి జ్యోతి రమ్మని పిలిచింది. పొద్దున నుంచి ఒకటే ఫోన్లు చేసింది. నాగరాజుకు నిద్రమాత్రలు వేసేశానని ఫోన్‌ చేయడంతో నా ఫ్రెండ్స్‌ను తీసుకుని వెళ్లాను. తర్వాత మేమంతా కలిసి అతడిని చంపేశాం. తర్వాత శవాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి దూరంగా పడేశామ’ని కార్తీక్‌ వివరించాడు. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు డీసీపీ రామచంద్రారెడ్డి తెలిపారు.

పాలమూలు జిల్లాకు చెందిన నాగరాజు తన భార్యతో కలసి హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అయితే పెళ్లికి ముందునుంచే ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే పెళ్లైన తరువాత దూరమైన వారి సంబంధం మళ్లీ కార్మాన్ ఘాట్ కు చేరుకోవడంతో బలపడింది. అదే కార్పెంటర్‌ నాగరాజు హత్యకు దారితీసింది. ఈ కేసులో అతడి భార్య జ్యోతి, ప్రియుడు కార్తీక్‌, దీపక్, యాసీన్‌, నరేష్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జ్యోతి, కార్తీక్‌, అతడి స్నేహితులు కలిసి పథకం ప్రకారం నాగరాజును హత్య చేశారని డీసీపీ రామచంద్రారెడ్డి తెలిపారు. నేరం చేసినట్టు నిందితులు అంగీకరించారని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : husband murder  karmanghat  Lalaguda  murder case  Hyderabad police  crime  

Other Articles