High Court Serious warn to Officials on Rooster Fights | కోళ్ల పందాలపై హైకోర్టు గరం.. అధికారులకు సీరియస్ వార్నింగ్

High court serious on cocks fight

Rooster Fights, High Court, Andhra Pradesh, Officers, Leaders, Cock Fights Leaders

High Court gives a strong warning to AP officers over rooster fights issue, warned strongly not to conduct it. People come from other cities and states as well to watch it but the complete responsibility should be taken by the state government, the court said to send notices to 49 Thasildhar's.

కోడి పందాలు.. హైకోర్టు సీరియస్

Posted: 01/04/2018 04:17 PM IST
High court serious on cocks fight

ప్రజా ప్రతినిధులపై హైకోర్టు గరం అయ్యింది. కోడి పందాలను నిర్వహించకూడదని ఆదేశించినప్పటికీ.. కొందరు ప్రజా ప్రతినిధులు ఆసక్తికనబరుస్తుండటం తెలిసిందే. దీంతో ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు తాజాగా మరోసారి ఆదేశాలు జారీ చేసింది.

ఈసారి కూడా కోడి పందేల నిర్వ‌హ‌ణ‌ను అడ్డుకునేందుకు సాధ్యమైనంత మేర కృషి చేయాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, జిల్లా కలెక్టర్లకు, డీజీపీలకు నోటీసులు కూడా పంపింది. ఈ నోటీసుల‌కు స‌మాధానంగా గతేడాది 43 మంది తహశీల్దార్లు, 49 మంది పోలీసు అధికారులకు నోటీసులు ఇచ్చిన విష‌యాన్ని ప్రభుత్వం గుర్తుచేసింది.

అయితే నోటీసులు ఇవ్వ‌గానే స‌రిపోద‌ని, త‌ద‌నంత‌ర చ‌ర్య‌ల‌పై కూడా దృష్టి సారించాల‌ని ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈ ఏడాది కోడిపందేలు జరగకుండా చర్యలు తీసుకోవ‌డానికి ప్ర‌భుత్వం తీవ్ర కృషి చేస్తున్నట్లు క‌నిపిస్తోంది. త‌రాలుగా వస్తున్న ఈ పందేల‌కు గోదావ‌రి జిల్లాల్లో చాలా ప్రాధాన్య‌త ఉంది. ల‌క్ష‌లు, కోట్ల‌లో డ‌బ్బు చేతులు మారే ఈ కోడి పందేల నిర్వ‌హ‌ణ‌ను క‌ట్ట‌డి చేయ‌డానికి ప్ర‌భుత్వాలు ఎంత ప్ర‌యత్నించిన‌ప్ప‌టికీ ఏటా జ‌రుగుతూనే ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles