Triple Talaq Bill Congress Creates Rucks in RS | ట్రిపుల్ తలాక్ బిల్లు.. పెద్దల సభలో కాంగ్రెస్ రచ్చ... వాయిదా

Rajya sabha adjourned after triple talaq rucks

Triple Talaq Bill, Rajya Sabha, RS Prasad, PJ Kurian, Congress Party, Select Committee , Triple Talaq Issue

The Triple Talaq Bill has been tabled in the Rajya Sabha with the opposition parties, including Congress creating a ruckus in the House. ... Any member if the bill has not been referred to a joint committee of the house, and if an amendment is moved to a select committee, then we have to follow rule 132. Later Deputy Speaker PJ Kurian Adjourned Rajya Sabha.

ట్రిపుల్ తలాక్ బిల్లు.. గందరగోళం... రాజ్యసభ వాయిదా

Posted: 01/03/2018 04:27 PM IST
Rajya sabha adjourned after triple talaq rucks

లోక్ సభలో ఆమోద ముద్ర వేయించుకున్న ట్రిపుల్ త‌లాక్ బిల్లుపై గంద‌ర‌గోళం చెల‌రేగింది. బుధవారం రాజ్యసభలో చర్చ పూర్తి కాకుండానే సభ రేపటికి వాయిదా పడింది. అధికార, విప‌క్ష స‌భ్యుల మ‌ధ్య మాట‌ల యుద్ధం తారా స్థాయిలోనే సాగింది.

రాజ్య‌స‌భ‌లో కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ ఈ బిల్లును ప్ర‌వేశ పెట్టారు. ట్రిపుల్ తలాక్ బిల్లును సెల‌క్ట్ క‌మిటీకి పంపాల‌ని విప‌క్ష స‌భ్యులు డిమాండ్ చేశారు. ట్రిపుల్ త‌లాక్ బిల్లును తాము వ్య‌తిరేకించ‌డం లేదని, సెలెక్ట్ క‌మిటీకి పంపాల‌న్న‌దే త‌మ‌ డిమాండని కాంగ్రెస్ స‌భ్యుడు ఆనంద్ శ‌ర్మ అన్నారు. మ‌హిళా సాధికార‌త అత్యంత ముఖ్య‌మైన అంశమ‌ని ఆయ‌న అన్నారు.

బిల్లులో స‌వ‌ర‌ణ‌లను చేయాల్సి ఉంద‌ని, వాటిని సెలెక్ట్‌ క‌మిటీ సూచిస్తుందని అన్నారు. అయితే, అందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అభ్యంత‌రం తెలిపారు. ఈ నేప‌థ్యంలో గంద‌ర‌గోళం నెల‌కొన‌డంతో రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మ‌న్ కురియ‌న్ స‌భ‌ను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles