British Memorial creates Violence in Mumbai | ముంబై కుల చిచ్చు.. 200 ఏళ్ల క్రితం నాటి యుద్ధం ఎలా కారణం అయ్యిందంటే...

Violence near bhima koregaon

Bhima Koregaon, Bhima Koregaon Memorial, Dalit pride, Mumbai Violence, Anglo-Maratha Battle, British Memorial Bhima Koregaon, Mumbai Dalits Attack, Mumbai Bandh

People with saffron flags allegedly attack Dalits heading to Bhima Koregaon memorial near Pune. This annual gathering was to commemorate the 200th anniversary of the last Anglo-Maratha battle. How a British war memorial became a symbol of Dalit pride.

ముంబైలో కుల చిచ్చు.. అసలు కారణం ఏంటంటే...

Posted: 01/03/2018 10:51 AM IST
Violence near bhima koregaon

కుల చిచ్చు రాజుకోవటంతో ముంబై మహానగరం అల్లకల్లోలంగా మారింది. పుణే దగ్గర్లోని భీమా–కోరేగావ్‌ యుద్ధ స్మారకం వద్ద 200వ విజయోత్సవాల సందర్భంగా సోమవారం హిందూ, దళిత సంస్థల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇది కాస్తా ముదిరి హింసాత్మకంగా మారింది.

మరోవైపు లక్షలాదిగా తరలివచ్చిన వారిపై దుండగులు రాళ్లు రువ్వడంతోపాటు వాహనాలకు నిప్పుపెట్టారు. మంగళవారం ఉదయమే రోడ్లపైకి చేరుకున్న ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. ఇద్దరు చనిపోవటంతో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. దీంతో లోకల్ రైళ్లు సహా పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఘర్షణలను అదుపు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ అంబేద్కర్ మనవడు, భరిపా బహుజన్ మహాసంఘ్ నేత ప్రకాశ్ అంబేద్కర్ ఆరోపించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా బుధవారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు.

అసలు కారణం ఏంటంటే...

200 ఏళ్ల క్రితం ఆంగ్లో-మరాఠా వార్ జరిగింది. పేష్వా బాజీరావు-2 సైన్యానికి, ఈస్టిండియా కంపెనీకి చెందిన చిన్న సైన్యానికి మధ్య యుద్ధం జరిగింది. ఈస్టిండియా కంపెనీ సైన్యంలో ఎక్కువమంది దళితులే ఉండేవారు. ఆ యుద్ధంలో మరణించిన వారిలో ఎక్కువమంది దళితులే. దీంతో వారి స్మారకార్థం సన్సవాడి గ్రామంలో బ్రిటిష్ వారు ‘విజయ స్తూపం’ నిర్మించారు.

జనవరి 1న ఈ స్తూపం వద్ద 200వ వార్షికోత్సవం నిర్వహించారు. లక్ష మంది దళితులు స్మారక స్తూపం వద్దకు చేరుకున్నారు. పేష్వా బాజీరావు-బ్రిటిషర్లకు మధ్య జరిగిన యుద్ధంలో ఆంగ్లేయులే విజయం సాధించినప్పటికీ మరణించిన వారిలో దళితులే ఎక్కువ కాబట్టి వారి స్మారకార్థం స్తూపం ఏర్పాటు చేశారు. దీనికి గుర్తుగా దళితులు ప్రతి ఏటా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అయితే ఇది బ్రిటిష్ వాళ్ల విజయం కావడంతో అతివాద సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో వారిపై రాళ్ల దాడి జరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles