Five killed in road accident in Guntur అటోను ఢీకొన్న బస్సు.. ఐదుగురు మృతి

4 students killed after auto hit by rtc bus in guntur

guntur, RTC bus accident, Ponnuru to Srisailam rtc bus, Firangipuram accident, Repudi accident, Vemavaram 10th class student, Perecharla school students, auto accident, school children, accident news, andhra pradesh, crime, ap headlines, ap latest news, ap news, ap political news, ap politics breaking news

Four students and the driver of an auto died after an RTC bus hit their vehicle head-on at Repudi village of Firangipuram mandal

పొగమంచు కబలించింది.. రహదారి రక్తమోడింది..

Posted: 12/28/2017 10:42 AM IST
4 students killed after auto hit by rtc bus in guntur

దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతానికే పరమితమైన దట్టమైన పోగమంచు నవ్యాంధ్రలో పదో తరగతి విద్యార్థులు ఉసురు తీసింది. దట్టంగా అలుముకున్న పోగమంచు కారణంగా అటోలో పాఠశాలకు వెళ్తున్న నలుగురు విద్యార్థులతో పాటు అటో డ్రైవర్ కూడా మరణించాడు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. విద్యార్థులను పాఠశాలకు తీసుకెళుతున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢికొనడంతో ఈ ప్రమాదాం సంభవించింది.

అయితే దట్టంగా అలుముకున్న పోగమంచు కారణంగా అర్టీసీ బస్సు కనిపించకపోవడంతో.. రహదారి రక్తమోడింది. ఈ ఉదయం సంభవించిన ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురు విద్యార్థులు, ఆటో డ్రైవర్ మృతిచెందగా మరో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వేమవరం గ్రామం నుంచి పేరేచర్లలోగల పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు ఆటో ఎక్కారు. అయితే... వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామం వద్ద పొన్నూరు నుంచి శ్రీశైలం వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది.

దీంతో ఆటోలోని నలుగురు పదో తరగతి విద్యార్థులు కార్తీక్‌రెడ్డి, గాయత్రి, శైలజ, రేణుక, ఆటో డ్రైవర్ ధన్ రాజ్ ఘటనాస్థలంలోనే మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని గుంటూరులోని జీజీహెచ్‌కు తరలించారు. ఈ ప్రమాదఘటనపై మంత్రుల అచ్చెన్నాయుడు, అనంద్ బాబులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులకు అదేశాలు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : guntur  RTC bus accident  auto accident  school children  accident news  andhra pradesh  crime  

Other Articles