mothkupally narsimlu inner feelings on governor post గవర్నర్ పోస్టుపై మోత్కుపల్లి ఏమన్నారంటే..

Mothkupally narsimlu inner feelings on governor post

Tdp, Telangana leader, mothkupally narsimlu, governor, nda government

TDP Senior leader Mothkupally Narsimhulu revealed his feelings on the governor post, says its better for his health to forget that post.`

ఆ పోస్టుపై టీడీపీ సీనియర్ లీడర్ మదిలోని మాటలు..

Posted: 12/26/2017 10:43 AM IST
Mothkupally narsimlu inner feelings on governor post

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పునాదిరాళ్లుగా వున్న సీనియర్ నేతల్లో మోత్కుపల్లి నర్సింహులు ఒకరు. తన తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలతో ఏర్పర్చుకున్న అవినాభావ సంబంధంతో ఆయన పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలైన మోత్కుపల్లికి పార్టీలో కన్నా ప్రభుత్వ పరంగానే ఒక సముచిత స్థానం ఇవ్వాలని పార్టీ భావించింది. ఈ క్రమంలో ఆయన పేరును రాష్ట్ర గవర్నర్ గా నియమించేందుకు కేంద్రంలోని తమ భాగస్వామ్య పక్షమైన ఎన్టీఏ ప్రభుత్వానికి విన్నవించింది.

దీంతో త్వరలోనే మోత్కుపల్లికి గవర్నర్ పదవి వరిస్తుందని వార్తలు కూడా మీడియాలో హైలైట్ అయ్యాయి. అటు ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఎన్నుకోబడిన తరుణంలో అయనను సన్మానించేందుకు వెళ్లిన టీడీపీ నేతలతో పాటు వెళ్లిన మోత్కుపల్లికి.. త్వరలోనే గవర్నర్ పదవి నిన్ను వరిస్తుంది అని వెంకయ్యనాయుడు మోత్కుపల్లితో అన్నారని కూడా వార్తలు వచ్చాయి. దీంతో రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం, మార్పులు చేర్పులు జరిగిన ప్రతిసారి అశపడటం.. భంగపడటం మోత్కుపల్లి వంతైంది.

ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఈ పదవి తనకు దక్కకపోవడంపై మోత్కుపల్లి స్పందిస్తూ, ఆ పదవిపై తన మదిలోని మాటలు బయటపెట్టారు. ఇక గవర్నర్ పదవి కోసం మూడేళ్లుగా ఎదురుచూశానని, ఇక ఇప్పుడు దాని గురించి ఆలోచించడమే మానేశానని అన్నారు. ఆ పదవి గురించి మర్చిపోవడమే తన ఆరోగ్యానికి మంచిదని, దానిపై ఆశలు దాదాపు వదులుకున్నట్టేనని మోత్కుపల్లి వ్యాఖ్యానించడం గమనార్హం. తనను గవర్నర్ చేయాలనే ఆలోచన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిదేనని, తనకు ఆ పదవి ఇప్పించేందుకు ఆయన ఎంతో కృషి చేసినప్పటికీ, ఫలితం లేకుండా పోయిందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tdp  Telangana leader  mothkupally narsimlu  governor  nda government  

Other Articles