Ranchi CBI Court Convicted in Lalu Fodder Scam | దాణా స్కాం.. లాలూను దోషిగా తేల్చిన రాంచీ సీబీఐ కోర్టు

Lalu convicted in fodder scam

Ranchi, Fodder Scam, Lalu Prasad Yadav, Convicts, Bihar, Bihar Fodder Scam

Ranchi CBI Court Convicted Lalu Prasad Yadav in Fodder Scam. Ex CM Jagannath Mishra Acquitted.

దాణా స్కాంలో లాలూ దోషి.. జైలుకు తరలింపు

Posted: 12/23/2017 03:47 PM IST
Lalu convicted in fodder scam

దాణా స్కామ్ లో బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ను దోషిగా నిర్ధారించిన రాంచీ సీబీఐ కోర్టు. ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌ను దోషిగా ప్ర‌క‌టించించింది. 1990-97 మ‌ధ్య లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ బీహార్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో దాణా కొనుగోళ్ల‌లో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

అప్ప‌ట్లో బీహార్‌లో దాణా కోసం మొత్తం రూ.900 కోట్లు ఖర్చు చేశారు. 1991 నుంచి 1994 మధ్య ట్రెజరీ నుంచి పశుదాణా కోసం అక్ర‌మంగా రూ.89 లక్షల విత్‌డ్రా చేశారు.ఈ కేసులోనే సుదీర్ఘంగా వాద‌న‌లు జ‌రిగాయి. దాణా సరఫరా చేస్తున్నారని లేని కంపెనీలను సృష్టించి వాటి పేరుతో డబ్బులు డ్రా చేశారని కోర్టు తేల్చింది. ఇక కోర్టు దోషిగా తేల్చటంతో ఆయన్ని రాంచీ జైలుకు తరలించారు. జనవరి 3న శిక్షలు ఖరారు చేయనున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles