Reactions on 2G spectrum scam case acquital 2జీ కేసు తీర్పుపై ఎవరేమన్నారంటే..

Reactions of nda upa leaders on 2g spectrum scam case acquital

anna hazare, social activist, A.Raja, Kanimozhi, 2g spectrum scam, subramanian swamy, manmohan singh, kapil sibal, shashi tharoor, chidambaram, arun jaitley, reactions on 2g verdict

After A Raja, Kanimozhi and all other accused acquitted in 2G case.. the leaders from various parties reacted on this verdict

2జీ కేసు తీర్పుపై ఎవరేమన్నారంటే..

Posted: 12/21/2017 03:06 PM IST
Reactions of nda upa leaders on 2g spectrum scam case acquital

యూపీఏ సంకీర్ణ ప్రభుత్వానికి గుదిబండలా తయారై.. ఆ ప్రభుత్వంపై దేశ ప్రజల్లో వ్యతిరేకత రావడానికి కారణమైన అవినీతి కుంభకోణాల్లో అతిపెద్దదైన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో పాటియాలా హౌస్ కోర్టు కీలక తీర్పు వెలువరించిన నేపథ్యంలో.. పలువురు ఈ కేసు విషయమై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సామాజిక కార్యకర్త, గాందేయవాది, అవినీతి రహిత భారత్ ఉద్యమ రూపకర్త అన్నా హాజారే సంచలన వ్యాఖ్యలు చేశారు.

2జీ స్కాం కేసును కొట్టేసిన పటియాలా హౌస్ కోర్టు... కనిమొళి, రాజాలతో పాటు మరో 15 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించడం సరైనదేనని ఆయన అభిప్రాయపడ్డారు. న్యాయస్థానం సరైన తీర్పును వెలువరించిందని ఆయన స్పష్టం చేశారు. కోర్టు ఎలాంటి తీర్పును వెలువరించినా... మనందరం శిరసా వహించాల్సిందేనని చెప్పారు. కోర్టు తీర్పును ప్రశ్నించడం సరికాదని అన్నారు. కోర్టులు సరైన సాక్ష్యాలనే చూస్తాయని... నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేకపోతే కోర్టులు ఏమీ చేయలేవని చెప్పారు. ఒకవేళ ప్రభుత్వం వద్ద సరైన సాక్ష్యాలు ఉంటే... ఉన్నత న్యాయ స్థానంలో అప్పీల్ చేసుకోవచ్చని అన్నారు. ఈ తీర్పుపై యూపీఏ, ఎన్డీఏ నేతలు ఎలా స్పందించారంటే..

మన్మోహన్ సింగ్: కోర్టు తీర్పును గౌరవిస్తున్నాం. యూపీఏపై ఎలాంటి ఆధారాలు లేకుండానే చెడు ప్రచారం జరిగిందనే విషయం కోర్టు తీర్పుతో వెల్లడైంది.

చిదంబరం: గత ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు కుంభకోణంలో ఉన్నారనే ప్రచారాలు తప్పు. ఈ రోజు అదే విషయం రుజువైంది.

సుబ్రహ్మణ్యస్వామి: సరైన ఆధారాలతో కేంద్ర ప్రభుత్వం వెంటనే హైకోర్టులో అప్పీల్ చేయాలి.

శశి థరూర్: అమాయకులను ఇబ్బంది పెట్టారనే విషయాన్ని కోర్టు గుర్తించింది. న్యాయం గెలిచింది.

అరుణ్ జైట్లీ్: కోర్టు తీర్పును యూపీఏ నేతలు సన్మాన పత్రాలు భావించరాదు. ఉన్నత న్యాయస్థానంలో తీర్పులు మారుతాయి. దర్యాప్తు సంస్థలపై ప్రగాఢ నమ్మకం వుంది.

కపిల్ సిబల్: ప్రధాని మోదీ పార్లమెంటుకు వచ్చి వివరణ ఇవ్వాలి. 2జీతో పాటు పలు కుంభకోణాల్లో యూపీఏ ప్రభుత్వం కూరుకుపోయిందనే తప్పుడు ప్రచారంతోనే మోదీ ప్రభుత్వం ఏర్పడింది. కానీ కోర్టు తీర్పుతో అసలు విషయం ఏమిటో అందరికీ తెలిసింది. 2జీ అనేది విపక్షానికి చెందిన అబద్ధాలతో కూడిన స్కాం అనేది రుజువైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles