inhumans kill lic agent in bhogapuram of andhrapradesh ప్రాణం పోతుంటే చోద్యం చూస్తారా..? మీరూ మనుషేలా..?

Inhumans kill lic agent in bhogapuram of andhrapradesh

humanity, social media, life, save life, achyut, vishnu, heart attack, srikakulam, bhoghapuram, rtc driver, autowala, vishakapatnam, chakivalas, latest news

An Lic agent achyut who suffered a severe heart problem in rtc bus was mercilessly forced to get down of bus who was traveling along with his son to hospital in vishakapatnam.

ప్రాణం పోతుంటే చోద్యం చూస్తారా..? మీరూ మనుషేలా..?

Posted: 12/21/2017 09:29 AM IST
Inhumans kill lic agent in bhogapuram of andhrapradesh

మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వం ఉన్నవాడు అన్న కవి మాటలు నిజమవుతున్నాయి. ఆధునిక మానవుల్లో మంచితనం కొడిగడుతోంది. సంకుచిత ధోరణితో మనిషి కుంచించుకుపోతున్నాడు. మనిషికి మనిషే సాయం చేసుకోవాలన్న ఇంకితాన్ని మర్చిపోయాడు. ఎంతో విలువైన ప్రాణం పోతున్నా చోద్యం చూస్తు నిలబడ్డాడే కానీ.. ప్రాణాలను కాపాడేందుకు ఒక్కడైనా ముందుకు రాలేదు.

ఆధునిక యుగంలో మంటగలుస్తున్న మానవత్వానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనం. సోషల్ మీడియాలో లైకుల కోసం పడే పాట్లు.. మంచి కోసం. విలువైన ప్రాణం కోసం చేయి కలపడం మాత్రం తెలియదు. లైకులతో తమ అభిప్రాయాలను పంచుకుంటారే కానీ.. అర్థించేవారికి అపన్నహస్తాన్ని అందించరు. కొనఊపురితో  విలవిలలాడుతున్న మనిషి.. ఇక తమ వద్ద వున్నప్పుడే ప్రాణం పోతే తామే బాధ్యులని చేస్తూ పోలీసు కేసుల చుట్టూ తిరగాల్సి వస్తుందని భావించి.. ఎవరికి వారు తప్పించుకోచూశారు. ఈ హృదయవిదారక ఘటన విజయనగరం జిల్లాలోని భోగాపురంలో జరిగింది.

వారం రోజులుగా తీవ్రైన దగ్గుతో బాధపడుతున్న శ్రీకాకుళం బ్యాంకర్స్ కాలనీకి చెందిన ఎల్ఐసీ ఏజెంట్ పొన్నాడ అచ్యుత్ (50).. తన కుమారిడితో కలసి అసుపత్రిలో చూయించుకునేందుకు ఆర్టీసీ బస్సులో విశాఖపట్టణం బయలుదేరాడు. బస్సు విజయనగరం జిల్లాలోని భోగాపురం ఫ్లై ఓవర్ వద్దకు చేరుకునే సరికి అచ్యుత్ అస్వస్థతకు లోనయ్యాడు. గుండెల్లో నొప్పిగా ఉందని కుమారుడికి చెప్పాడు. విష్ణు కండక్టర్ కు విషయం చెప్పి ఏదైనా ఆసుపత్రి కనిపిస్తే ఆపాలని కోరాడు.

తన తండ్రి పరిస్థితి చూసి విలవిల్లాడిన విష్ణుకు ఏం చేయాలతో తోచలేదు. కనీసం బస్సులో వున్న ఏ ఒక్కరైనా 108కు ఫోన్ చేయలేదు. చాకివలస చౌరస్తా వద్దకు వచ్చేసరికి నొప్పి ఎక్కువై అచ్చుత్ విలవిల్లాడిపోయాడు. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే బస్సు ఆపేసి అచ్యుత్, అతడి కుమారుడిని నడిరోడ్డుపై దించేశాడు. అర్టీసీ బస్సు డ్రైవరే చోరవ తీసుకోకపోతే..  అటోవాలాలు ముందుకోస్తారా..? అదే జరిగింది. ఒక్కరంటే ఒక్క అటోవాలా కూడా ముందుకు రాలేదు.

చివరాఖున ఓ ఆటోవాలా ముందుకొచ్చి ఎక్కించుకుని తీసుకెళ్తుండగా, అచ్చుత్ కు మరింత నోప్పి అధికం కావడాన్ని గమనించిన అటోడ్రైవర్ మారిన మార్గమధ్యంలోనే దించేసి వెళ్లిపోయాడు. కనీసం అక్కడైన ఏ ఒక్క ధర్మాత్ముడైనా అంబులెన్సుకు ఫోన్ చేసివుంటే ఎంతో మంది జీవితాలలో వెలుగునింపే ప్రయత్నం చేసిన ఆ ప్రాణం నిలబడేది. కానీ మా పని మాకు ముఖ్యం మాకు సామాజం అంటే సోషల్ మీడియానే అనుకుని భ్రమల్లో బతుకులీడుస్తున్న నేటి తరం మనుషులు మచ్చకైనా లేని మానవతం ఆ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.

ఎవరైనా సాయం చేయండీ సార్.. మా నాన్నను అసుపత్రికి తీసుకెళ్లేందుకు హెల్స్ చేయండీ సార్ అని ఓ వైపు విలపిస్తూ ఆ కొడుకును చూసి మరింత దిగజారిన ఆ తండ్రి అరోగ్యం పూర్తిగా విషమించింది.. దీంతో నడిరోడ్డుపై తీవ్ర మానసిక వేదన అనుభవిస్తూ ఆ తండ్రి తన కొడుకు విష్ణు చేతుల్లోనే.. ప్రాణాలను విడిచాడు. ఆయన చనిపోయిన ప్రదేశానికి కొన్ని మీటర్ల దూరంలో ప్రైవేటు క్లినిక్‌లు ఉన్నాయి. కిలోమీటరు దూరంలో ప్రభుత్వాసుపత్రి ఉంది. బస్సు డ్రైవర్ కనికిరించినా, ఆటోవాలా.. చుట్టూ గుమిగూడిన జనం ఎవరో ఒకరు సాయం చేసినా తన తండ్రి బతికేవాడని విష్ణు కన్నీటి పర్యంతమయ్యాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles