vijay sai wife vanita reddy fires on media ఈ వనిత మారనే లేదు..

Vijay sai wife vanita reddy alias vara lakshmi fires on media for blaming her

tollywood comedian vijay sai, comedian vijay sai, vanita, vanita absconding, shashidar, lawyer srinivas, tollywood vijay sai, tollywood comedian vijay, comedian vijay, ammayelu abbayelu, vijay, comedian vijay sai, vijay death, comedian vijay sai death

Tollywood comedian vijay sai wife vanita reddy alias vara lakshmi fires on media for allegedly blaming her in her husband suicide case.

పోలీసులకు లొంగిపోతా.. మీడియాపై వనిత రుసరుసలు..

Posted: 12/20/2017 12:34 PM IST
Vijay sai wife vanita reddy alias vara lakshmi fires on media for blaming her

తన భర్త అత్మహత్య కేసలో తనను పోలీసులు అరెస్టు చేస్తారన్న వార్తలు రావడంతో తాను పరారీలో వున్నానని కొన్ని, పారిపోయాయనని మరికొన్ని మీడియా సంస్థలు అసత్య కథనాలు రాసాయని మీడియాపై రుసరుసలాడిన  టాలీవుడ్ యువ హస్యనటుడు విజయ్ భార్య వనితా రెడ్డి తాను ఎక్కడికీ పారిపోలేదని స్పష్టం చేశారు. తాను ఇవాళ పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతున్నానని కూడా తెలిపారు. మహిళ అని కూడా చూడకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా తనపై తప్పుడు కథనాలు రాశారని అగ్రహం వ్యక్తం చేశారు.

వాస్తవాలను మరుగున పడేసే కథనాలతో అబద్దాలను నిజాలుగా నమ్మించే ప్రచారం మంచిది కాదని అభిప్రాయపడ్డిన అమె.. మీడియా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని కోరారు. ఇక కారు కోసం గొడవ జరగలేదని, ఆ కారు తనదే అని చెప్పిన అమె.. తన భర్త అత్మహత్యకు పాల్పడేందుకు ముందు రోజు తన కారును తన భార్య రౌడీల సాయంతో తీసుకెళ్లిందని, తనపై దాడి కూడా చేసిందని పోలిస్ స్టేషన్ లో పిర్యాదు ఎందుకిచ్చాన్న విషయాన్ని మర్చిపోయినట్లు వున్నారు. ఇక తాను మౌనంగా ఉండటంతో, ఏదో ఒకటి రాస్తూ తనకు మానసిక క్షోభను కలిగించారని వనిత అవేదన వ్యక్తం చేసింది.

అయితే పోలీసులే స్వయంగా విచారణకు హాజరుకావాలని నోటీసులను అందించిన విషయాన్ని మర్చిపోయారా..? అయినా విచారణకు హాజరుకాకపోవడం మీడియా అమె పరారీలో వుందన్న కథనాలు రాసిందన్న విషయం తెలియదా..? కనీసం ఏదో అవసరమైన కార్యంపైన వెళ్లినా పోలీసులకు ఆ మేరకు సమాచారమైనా ఇచ్చివుంటే వారు విషయాన్ని మీడియాకు చెప్పేవారు కదా. ఇక తన కారు తీసుకునేందుకు హ్యుందాయ్ షోరూమ్ వాళ్లని తీసుకెళ్లానని తెలిపిన అమె.. వారు విజయ్ సాయిపై దాడి ఎందుకు చేశారన్న విషయంతో పాటు అపార్టుమెంటు సెక్యూరిటీని ఎందుకు వారించారన్న విషయం మాత్రం అమెకే తెలియాలి.

విజయ్ తల్లిదండ్రుల వల్లే తమ మధ్య విభేదాలు తలెత్తాయని వనిత తెలిపారు. విజయ్ కి సినిమాలు లేకపోయినప్పటికీ, కలిసి బతుకుదామని తాను భరోసా ఇచ్చానని చెప్పారు. విజయ్ తనపై చెడు ప్రచారం చేశాడని వాపోయారు. తాను ఎక్కడకు వెళ్లినా, వెంటపడి వేధించేవాడని చెప్పారు. ఈ క్రమంలోనే విడాకుల కోసం కేసు వేశానని తెలిపారు. విజయ్ ఎంతో మంది అమ్మాయిలను బెడ్ రూమ్ కి తీసుకు వచ్చేవాడని చెప్పారు. డబ్బు కోసం వేధించేవాడని అన్నారు. తనను ఎన్నోసార్లు కొట్టాడని తెలిపారు. భర్త మరణించినా తరువాత అయనకు ఎయిడ్స్ వుందని చెప్పిన వనిత.. తాజాగా మాటమార్చి తనను వేధించాడని అందుకనే విడాకులు కోరారని చెప్పడం.. ఎంతవరకు నిజమన్నది పోలీసులు, న్యాయస్థానమే తేల్చాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : comedian  vijay sai  suicide  vanita  shashidar  lawyer srinivas  tollywood  crime  

Other Articles