White House blames North Korea for WannaCry cyber attack వాన్నాక్రై వ్యాప్తి వెనుక ఉత్తర కొరియా

Trump administration blames north korea for wannacry ransomware attack

North Korea, WannaCry, ransomware attack, computer worm, donald trump, kim jong, Trump administration, Trump's Security Adviser, Tom Bossert

U.S. government is publicly acknowledging that North Korea was behind the WannaCry computer worm that affected more than 230,000 computers in over 150 countries earlier this year.

వణికించిన వాన్నాక్రై వ్యాప్తి వెనుక ఉత్తర కొరియా

Posted: 12/19/2017 12:01 PM IST
Trump administration blames north korea for wannacry ransomware attack

ప్రపంచం మొత్తాన్ని గజగజలాడించిన 'వాన్నాక్రై' కంప్యూటర్ వార్మ్ వెనుక ఉన్నది ఉత్తర కొరియానేనని అగ్రరాజ్యం అమెరికా సంచలన అరోపణలు చేసింది. ఈ ర్యాన్సమ్ వేర్ అటాక్ కర్త నార్త్ కొరియానేనని అరోపించింది. ఇదివరకే వాన్నాక్రై వెనుక ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ హస్తం ఉందంటూ గతంలో పరోక్ష విమర్శలు చేసిన అగ్రరాజ్య అధక్ష కార్యాలయం తాజాగా అందుకు బలమైన సాక్షాలు ఉన్నాయంటూ ప్రకటించింది.

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ నేతృత్వంలోనే వాన్నాక్రై కంప్యూటర్ వార్మ్ డెవలప్ అయ్యిందంటూ అగ్రారాజ్య అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హోమ్ లాండ్ భద్రతా సలహాదారు టామ్ బాసొర్టే  అరోపించారు. ఈ మేరకు ఆయన తన పేరిట వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఉత్తర కొరియాకు చెందిన లాజరస్ సంస్థ ద్వారానే ఈ సైబర్ దాడి జరింగిందని బాసొర్టే తెలిపారు.

దాడికి వెనుక ఉన్న సూత్రధారులను తాము దర్యాప్తులో గుర్తించామని బాసొర్టే వెల్లడించారు. గత దశాబ్ద కాలంగా ఉత్తర కొరియా చర్యలు ఏమాత్రం బాగోలేవని... కవ్వింపు చర్యలకు పాల్పడుతూ, తోటి దేశాలను ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. ఇందులో భాగంగానే వాన్నాక్రై ద్వారా దాడికి తెగబడిందని చెప్పారు. అయితే, ఈ ఆరోపణలపై ఉత్తర కొరియా ప్రభుత్వం కానీ, కిమ్ జాంగ్ కానీ ఇంతవరకు స్పందించలేదు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : North Korea  WannaCry  ransomware attack  computer worm  donald trump  kim jong  Tom bossert  

Other Articles