No debit card swipe fee up to Rs 2000 డెబిట్ కార్డు చెల్లింపుదారులకు కేంద్రం గుడ్ న్యూస్..

Elief for debit card users govt to bear mdr charges

Winter Session of Parliament, MDR, debit card transactions, government loses, Debit Card, ATM, RBI, Reserve Bank of India, UPI, BHIM, Digital transactions, merchant discount rate

From January 1 next year, you will not be charged fees on debit card transactions up to Rs 2,000 for at least two years. In an effort to boost digital payments, the Union Cabinet has decided to waive the merchant discount rate (MDR) applicable on all debit cards,

డెబిట్ కార్డు చెల్లింపుదారులకు కేంద్రం గుడ్ న్యూస్..

Posted: 12/16/2017 05:32 PM IST
Elief for debit card users govt to bear mdr charges

నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించడం కోసమే నోట్ల రద్దును చేపట్టామని ప్రకటించిన కేంద్ర ఆ నిర్ణయం తీసుకున్న తరువాత సుమారు 14 నెలలు మరో సముచిత నిర్ణయం తీసుకుని డిజిటల్ లావాదేవీలకు ప్రతిబంధకంగా వున్న అడ్డంకులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరీ ముఖ్యంగా ఈ తరహా లావాదేవీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. డెబిట్ కార్డుల ద్వారా చేస్తున్న లావాదేవీలపై వసూలు చేస్తున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)లో సరవణలు చేస్తూ వినియోగగారులకు ఊరటను ప్రకటించింది.

దీంతో ఇక నుంచి రూ.2 వేల వరకు చేసే డిజిటల్ చెల్లింపులపై ఎలాంటి చార్జీ పడబోదని ప్రభుత్వం స్పష్టంచేసింది. రూ.2 వేల వరకు జరిపే నగదు రహిత లావాదేవీలపై రెండు శాతం టాక్స్ ఇన్నాళ్లూ దుకాణాదారులు వసూలు చేసేవారు. కేంద్రం నిర్ణయంతో ఇకపై ఆ చార్జీలు వినియోగదారులపై పడవు, ఆ చార్జీలను కేంద్రం దుకాణాదారులకు తిరిగి చెల్లించాలని నిర్ణయం తీసుకోవడంతో వినియోగదారులకు ఊరట లభించనుంది, 2018, జనవరి 1 నుంచి రెండేళ్ల పాటు ఈ భారం ప్రభుత్వమే మోయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.

డెబిట్ కార్డ్ లేదా భీమ్ యూపీఐ లేదా ఏఈపీఎస్ రూ.2 వేల వరకు చేస్తున్న లావాదేవీలపై వ్యాపారస్తుల నుంచి ఎలాంటి చార్జీ వసూలు చేయరు. డెబిట్, క్రెడిట్ కార్డు సర్వీసులపై వ్యాపారస్తుల నుంచి బ్యాంకులు వసూలు చేసేదే మర్చంట్ డిస్కౌంట్ రేట్. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. ఏడాదికి రూ.20 లక్షలలోపు టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారస్తులు పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మెషిన్లపై డెబిట్ కార్డుల ద్వారా చేసే ఒక్కో లావాదేవీపై 0.4 శాతం ఎండీఆర్ విధించాలని నిర్ణయించారు. ఇది గరిష్ఠంగా రూ.200 వరకు ఉంటుంది.

ఇక క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ ద్వారా లావాదేవీలు చేస్తే 0.3 శాతం చార్జీ వసూలు చేస్తారు. ఇది కూడా గరిష్ఠంగా రూ.200 వరకు ఉంటుంది. ఏడాదికి రూ.20 లక్షలకుపైన టర్నోవర్ ఉండే వ్యాపారస్తులకు ఇది 0.9 శాతం (డెబిట్‌కార్డ్‌పై), గరిష్ఠంగా రూ.1000 వరకు ఉంటుంది. క్యూఆర్ కోడ్ లావాదేవీలపై ఇది 0.8 శాతం, గరిష్ఠంగా రూ.1000 ఉండనున్నది. ఇవన్నీ జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్బీఐ వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MDR  Debit card  RBI  Reserve Bank of India  UPI  BHIM  Digital  

Other Articles