Union Cabinet clears triple talaq bill వరుసగా 3సార్లు ఆ పదవినియోగం.. మూడేళ్ల జైలు

Union cabinet clears bill that makes triple talaq criminal offence

Cabinet triple talaq, Triple talaq, Instant triple talaq, Triple talaq Bill, Union Cabinet, Narendra Modi, Criminal offence, Muslim Personal Law, Divorce in Islam, Saira Bano, PM modi, supreme court,

The Union Cabinet on cleared a bill that criminalises the Islamic practice of instant triple talaq, ahead of it being taken up in the Winter Session of Parliament.

వరుసగా 3సార్లు ఆ పదవినియోగం.. మూడేళ్ల జైలు

Posted: 12/15/2017 03:56 PM IST
Union cabinet clears bill that makes triple talaq criminal offence

ఒకప్పుడు అ పదం వింటేనే మహిళలు గుండెల్లో వణుకు పుట్టేంది. సమస్యలు ఉత్పన్నమయ్యో లేక అకారణంగానో గాని.. ఈ పదాన్ని మూడు సార్లు ఉచ్చరించి.. తమ నూరేళ్ల దాంపత్య జీవితంలోకి వచ్చిన భాగస్వాములను అకారణంగా తమ జీవితాల్లోంచి నెట్టివేశేవారు. ఇక మారిన పరిస్థితుల నేపథ్యంలో మరీ ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో దీనిపై దృష్టి సారించిన అధికార పార్టీ.. మహిళల్లో వున్న అందోళనను గుర్తించింది. వారికి భరోసా ఇచ్చింది. అదే మాట ప్రకారం చట్టాన్ని తీసుకువచ్చింది.

ఇంతకీ ఏంటా పదం అంటారా... తలాక్.. విడాకులు.. ఈ పదం వింటేనే ముస్లిం మహిళల గుండెల్లో గుబులు.. అలాంటి తమ భర్తల నోటి వేంట ఈ పదం మూడు పర్యాయాలు వస్తే.. ఇక తమ జీవితాలు బుగ్గే. ఇలా ట్రిపుల్ తలాక్ తమ జీవితాలను, తమ అడపిల్లల జీవితాలను చిన్నాభిన్నం చేస్తుందన్న అందోళన ఇక వారిలో ప్రస్తుతం లేదు.  ఎందుకంటే ట్రిపుల్ తలాక్ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ విధంగా విడాకులు ఇవ్వటాన్ని నేరంగా కేబినెట్ స్పష్టం చేసింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును కేంద్రం ప్రవేశ పెట్టనుంది. దీంతో ఈ పద వినియోగాన్ని మూడు వరుస సార్లు చేసి విడాకులు పొందాలనుకునే వారికి ఇక కటకటాలే స్వాగతం పలకనున్నాయి.

ఈ బిల్లు ప్రకారం ఇక ఎవరైనా ముస్లిం భార్యభర్తలు ట్రిపుల్ తలాక్ చెబితే వారికి మూడు సంవత్సరాల జైలు శిక్షను విధించనుంది. 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇవ్వటాన్ని రాజ్యాంగ విరుధ్ధమంటూ సంచలన తీర్పు వెల్లడించింది. కేంద్రహోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ ఈ డ్రాఫ్ట్ ని రెడీ చేయటానికి నియమించిన కమిటీకి నేతృత్వం వహించారు. ఇప్పటికే పాకిస్ధాన్, సౌదీ అరేబియా వంటి చాలా ముస్లిం దేశాల్లో ట్రిపుల్ తలాక్ పై నిషేదం కొనసాగుతుంది. అయితే ఈ నిషేదంపై సమాజ్ వాదీ పార్టీ, తృణముల్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles