'Amended Act allows conduct of rekla races too' సంక్రాంత్రి కన్నా ముందుగానే వచ్చేస్తున్న ఉత్సవాలు..

Get ready jallikattu premier league in chennai from january 7

Advocate General Vijay Narayan, jallikattau, rekla, january, supreme court, madras high court, state legislature, prevention of cruelty to animals act, justice ts sivagnanam, k.ravichandra baabu, tamil nadu, maharastra, bullock cart race, manjuvirattu, vadamadu, erudhuvidumvizha

An amendment made by the State legislature to the Prevention of Cruelty to Animals Act of 1960, a Central enactment, in January would enable conduct of not only ‘jallikattu’ but also ‘rekla’ (bullock cart) races across the State.

సంక్రాంత్రి కన్నా ముందుగానే సంప్రదాయ పోటీలు..

Posted: 12/15/2017 12:33 PM IST
Get ready jallikattu premier league in chennai from january 7

ప్రజలతో ముడిపడిన సంప్రదాయ అచారం కన్నా ఏ చట్టం, శాసనం ఎక్కువకాదని తమిళనాడు వాసులు మరోమారు రుజువుచేశారు. దీంతో మూగజీవాలను క్రూరంగా హింసిస్తున్నారన్న అభియోగాల నేపథ్యంలో అంక్షల నడుమ అక్కడక్కడా.. నిర్వహించబడిన జల్లికట్టు.. గత ఏడాది మాత్రం పూర్తిగానే కనుమరుగయ్యింది. తమిళనాడు సహా మహారాష్ట్రంలో నిర్వహించే ఈ సంప్రదాయ క్రీడపై అంక్షలను ఎత్తివేయాలని తమిళవాసుల డిమాండ్ తో తలొగ్గిన కేంద్రం ఎట్టకేలకు దిగివచ్చింది. వారి కొరిక మేరకు సంప్రదాయ జల్లికట్టు ఆటపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.

పెటా కార్యకర్తల పిర్యాదులు, న్యాయస్థానాల తీర్పుల నేపథ్యంతో పాటు అరవవాసుల డిమాండ్ ను కూడా పరిగణలోకి తీసుకున్న కేంద్రం 1960 జంతుహింస చట్టాన్ని సవరించింది. గతేడాది నిర్వహించాల్సిన జల్లికట్టు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆగిపోయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఆందోళనకారులతో మెరీనా బీచ్ నిండిపోయింది. ఆందోళనకారులకు సినీ పరిశ్రమ మద్దతు లభించింది. చట్ట సవరణ తీసుకురావాలంటూ ఏకంగా నెలరోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఆందోళన తీవ్రం కావడంతో కేంద్రం దిగివచ్చింది.

1960 జంతు హింస చట్టాన్ని సవరిస్తూ జల్లికట్టుకు అనుమతి ఇచ్చింది. కేంద్రం నిర్ణయంతో జల్లికట్టు నిర్వాహకుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జల్లికట్టుతో పాటు ముంజువిరాట్టు, వడమడు, ఎరుద్దువిడువిజ్జా పోటీలకు ఇక పచ్చ జెండా లభించినట్లే. అయితే ఇదే క్రమంలో రెక్లా పోటీలకు కూడా అనుమతి లభించింది. ఇది కూడా సంప్రదాయ క్రీడేనని దీనిని కూడా అనుమతించాలని దాఖలైన పిల్ పై న్యాయస్తానం సమ్మతిస్తూ ఉత్తర్వులు జారీచేసిందని సమాచారం.  అయితే సంక్రాంతికి ముందే వచ్చే నెల 7న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Advocate General Vijay Narayan  jallikattau  rekla  january  supreme court  madras high court  

Other Articles