Aviation Minister faces irate passengers on delay కేంద్రమంత్రికి చికాకు పుట్టించిన ప్రయాణికులు..ఎలా.?

Air india flight with aviation minister delayed 3 officials suspended

Civil Aviation minister, TDP leader, Ashok Gajapathi Raju, TDP, air india passenger, air india pilot, air india staff, air india suspension

A Vijaywada bound Delhi flight carrying 100 passengers along with Civil Aviation Minister Ashok Gajapathi Raju was delayed by more than an hour on Wednesday at the Delhi airport. The passengers were already inside the Air India flight, AI 459, including the minister.

కేంద్రమంత్రికి చికాకు పుట్టించిన ప్రయాణికులు..ఎలా.?

Posted: 12/14/2017 05:57 PM IST
Air india flight with aviation minister delayed 3 officials suspended

కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజుకు ఆయన సొంతశాఖకు చెందిన ఉద్యోగుల వల్ల పరాభవం ఎదురైంది. విమానయానంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న పరాభవాలను ఆయన ఎదుట ఏకరువు పెట్టారు. విజయవాడ నుంచి ఢిల్లీకి ఎయిరిండియా విమానంలో ప్రయాణిద్దామని వచ్చి విమానం ఎక్కిన కేంద్రమంత్రికి గుక్క తిప్పుకోనీయకుండా ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రయాణికుల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయిన మంత్రివర్యులు.. చికాకు పుట్టించేలా చేశారు. దీంతో ఆయన వెంటనే ఎయిరిండియా చైర్మన్ కు ఫోన్ చేసి అవే ప్రశ్నలను సంధించారు. దీని ఫలితంగా ఫైలట్ సహా నలుగురిని సస్పెండ్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. ఇవాళ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నుంచి విజయవాడ (గన్నవరం) విమానాశ్రయానికి చేరుకోవాల్సిన వుంది. ఇందుకు ఆయన ఎయిరిండియా విమానంలోకి ఎక్కారు. సుమారు గంటన్నర పాటు సహచర ప్రయాణికులతో పాటు ఆయన కూడా నిరీక్షించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగిం చేసుకుని తాము ఎయిరిండియాలో ఎదర్కోంటున్న ఇబ్బందులను ఆయనకు ఏకరువు పెట్టారు. ఒకరు అడుగుతుండగానే మరోకరు ప్రశ్నలు సంధిస్తూ.. ఆయనకు చుక్కలు చూపించారు. ఆయనపై ప్రశ్నలు వర్షం కురిపిస్తూ చిరాకు పెట్టించారు. ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరాల్సిన తమ విమానం గంటపాటు ఎందుకు ఆలస్యం అయిందని, ఎందుకు అంతసేపు తమను విమానంలో కూర్చొబెట్టారని నిలదీశారు.

దీంతో ఆయన వెంటనే ఎయిరిండియా చైర్మన్ కు మేనేజింగ్‌ డైరెక్టర్ ప్రదీప్ ఖరోలాకు ఫోన్ చేసి వెంటనే జరిగిన తప్పిదానికి వివరణ కోరారు. ఈ విమనాంలో మంత్రితో పాటుగా మొత్తం 125మంది ప్రయాణీకులు తమ సీట్లలో అసీనులైవున్నారు. అప్పటికీ గంటపాటు వేచివున్న ప్రయాణికులు మంత్రి రాగానే ఆయనపై అలస్యానికి కారణాలను అడిగారు. ఎయిరిండియా నిత్యం ఇలానే వ్యవహరిస్తుందని కూడా అరోపించారు. వెంటనే ఆయన చైర్మన్ కు ఫోన్ చేయడంతో.. వేగంగా కదిలిక వచ్చింది. అలస్యానికి కారణమైన పైలట్ సహా ముగ్గురు సిబ్బందిని ఎయిరిండియా వెంటనే సస్పెండ్‌ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles