Talks on S-400 Air Defence System at 'Profound Stage' ఆర్మీ అమ్ములపోదిలోకి ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్

India russia talks on s 400 air defence system at profound stage russian official

200 Kamov 226T helicopters, Defence Deal, India, India Russia defence contract, India Russia defence deal, India-Russia, India-Russia joint venture, moscow, Rostec, Russia, Russian defence, Russian Helicopters Andrey Boginisky, Russian S-400 Triumf, Russian S-400 Triumf air defence system, S 400, Triumf air defence systems, Viktor N Kladov

India had announced in October last year a deal on the Triumf air defence systems from Russia, worth over $5 billion and collaborate in making four state-of-the-art frigates besides setting up a joint production facility for making Kamov helicopters.

ఆర్మీ అమ్ములపోదిలోకి ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్

Posted: 12/13/2017 05:19 PM IST
India russia talks on s 400 air defence system at profound stage russian official

భారత సైన్యం అమ్ముల పొదిలోకి మరో అధునాతన ఆయుధ వ్యవస్థ చేరనుంది. రష్యన్ ఎస్‌-400 ట్రయంప్‌ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విక్రయ ఒప్పందంపై భారత్‌, రష్యా త్వరలోనే సంతకాలు చేయనున్నట్టు రష్యాకు చెందిన అర్మీ ఉన్నతాధికారులు ప్రకటించారు. సంబంధిత చర్చలు తుది దశకు చేరుకుంటున్నట్టు రష్యా రక్షణ, పరిశ్రమల బృందం (రోస్ టెక్) సంచాలకుడు విక్టర్‌ ఎన్ క్లదోవ్ వెల్లడించారు. ప్రస్తుతం భారత్‌ ఎన్ని ఎస్‌-400లను కొనుగోలు చేస్తుందన్న అంశంపై చర్చలు సాగుతున్నాయని వివరించారు.

‘ధర, శిక్షణ, సాంకేతికత బదిలీ, నియంత్రణ వ్యవస్థల ఏర్పాటు గురించి చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎస్‌-400ను సరఫరా చేసినా వ్యవస్థ గురించి శిక్షణనిచ్చేందుకు రెండేళ్లు పడుతుంది. అప్పుడే వీటిని ఉపయోగించగలరు’ అని క్లదోవ్ తెలిపారు. రష్యా నుంచి ఐదు బిలియన్ డాలర్లతో ఎస్‌-400 ట్రయంప్‌ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు చేస్తామని గతేడాది అక్టోబర్లో భారత్ ప్రకటించింది. దాంతోపాటు రెండు దేశాలు సంయుక్తంగా కమోవ్ హెలికాఫ్టర్ల తయారీ చేపడతాయని పేర్కొంది. గోవాలో బ్రిక్స్ దేశాల సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో చర్చించిన తర్వాత ఈ ఒప్పందం గురించి ప్రకటించారు.

ఎస్‌-400 ట్రయంప్ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ అత్యంత శక్తిమంతమైంది. ఆకాశంలో 400 కిలోమీటర్ల పరిధిలో దూసుకొచ్చే శత్రుదేశాల యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్ లను నాశనం చేయగలదు. దీంతో మొత్తం మూడు క్షిపణులను ప్రయోగించవచ్చు. రక్షణ పొరలాంటిది సృష్టించి ఒకేసారి 36 లక్ష్యాలకు గురిపెట్టగలదు. ఈ ఒప్పందం కుదిరి ఎస్‌-400లు భారత్‌ చేరితే ఆసియా ప్రాంతీయ రాజకీయాల్లో ఇదొక కీలక మలుపు అవుతుంది. చైనా, పాకిస్థాన్ ల వైఖరిలో పెనుమార్పులు సంభవించవచ్చు. శత్రుదేశాల క్షిపణుల నుంచి దేశంలోని ముఖ్య నగరాలు నాశనం కాకుండా రక్షణ ఛత్రం ఏర్పాటు చేయవచ్చు. ఇలాటి వ్యవస్థ అమెరికా వద్ద కూడా లేకపోవడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian army  defence deal  india  russia  s-400 air defence system  kamov  

Other Articles