uma madhava reddy resigns to TDP, to join TRS టీడీపీకి ఉమా మాధవరె్డడి రాజీనామా.. రేపే టీఆర్ఎస్ లోకి

Uma madhava reddy resigns to tdp to join trs

chief minister k. chandrasekhar rao, Nalgonda, Uma Madhava Reddy, bhongir, A Sandeep Reddy, Bhuvanagiri district, jagadishwar reddy, Harish rao, politics. TDP, TRS

telangana senior tdp leader and mla A uma madhava reddy today officially sends resignation letter to party leader Chandrababu, to join TRS with son tomorrow.

టీడీపీకి ఉమా మాధవరెడ్డి రాజీనామా.. రేపే టీఆర్ఎస్ లోకి

Posted: 12/13/2017 12:14 PM IST
Uma madhava reddy resigns to tdp to join trs

మాజీ మంత్రి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత  ఉమా మాధవరెడ్డి అధికార పార్టీ తీర్థం తీసుకునేందుకు ముహూర్తం ఖరారైంది. దీంతో ఇవాళ అమె అధికారికంగా తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపారు. ఇప్పటికే అధికార పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావును, మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మరో మంత్రి హరీశ్ రావుల సమక్షంలో తన కుమారుడు సందీప్‌రెడ్డి వెంటబెట్టుకుని కలసిన అమె.. గురువారం రోజున అధికారికంగా కారు ప్రయాణానికి రంగం సిద్ధం చేసుకున్నారు.  

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా ఉన్న ఉమా మాధవరెడ్డి... టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారనే వార్తలు గత కొద్ది రోజులుగా తెరపైకి వస్తునే వున్నాయి. అమె కూడా రేవంత్ రెడ్డితో కలసి పార్టీని వీడుతారన్న వార్తలు రాగా, అమె అప్పట్లో కాంగ్రెస్ లో చేరేందుకు చివరి క్షణంలో డ్రాప్ అయ్యారు. దీంతో అమె అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని వార్తలు ఊపందుకున్నాయి. ఈ వార్తలను నిజం చేస్తూ 14వతేదీన తమ అనుచరులతో కలిసి టీఆర్ఎస్‌లో చేరుతున్నారు.

కాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీలో నాయకుల కొరత ఏర్పడింది. ముక్కిమూలుగుతూ నలుగురు నాయకులు వున్నా.. వారందరినీ గాడిలో పెట్టి ముందుకు దూసుకెళ్లే విధంగా ఏ నాయకుడు లేకపోవడం గమనార్హం. ఎన్టీయార్ పార్టీ స్థాపించినప్పటి నుంచి, ఇప్పటి వరకు తెలుగదేశం పార్టీకి అండగా వుంటుంది తెలంగాణకు చెందిన నేతలే. తెలంగాణ మంచి పట్టుసాధించిన తెలుగుదేశం పార్టీ.. ఇంతలా పరిస్థితిని దిగజార్చుకోవడానికి కారణాలను విశ్లేషించుకోవాల్సిన అవసరం వుంది. టీడీపీకి ఓటు బ్యాంకు వుందన్న విషయం గత ఎన్నికలలో స్పష్టమైనా.. దానిని కాపాడుకునే స్థాయిలో నేతలు కరువయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nalgonda  Uma Madhava Reddy  bhongir  A Sandeep Reddy  kcr  Bhuvanagiri district  TDP  TRS  

Other Articles