professor haragaopal on ap ruling and opposition parties జనసేనకు అవకాశం అక్కడే లభిస్తుందని హరగోపాల్ వ్యాఖ్య

Professor haragaopal on ap ruling and opposition parties

professor haragopal, professor, political analyst, TDP, AP Ruling party, YCP, Jagan, janasena, Pawan kalyan, Andhra pradesh, political space, politics

political analyst and professor haragaopal on ap ruling and opposition parties says tdp moving in old passion and its vulnarable for jagan to come into power, IF jagan goes beihind bars then there is a chance for pawan kalyan party janasena to occupy the space.

టీడీపీ, వైసీపీ పార్టీలపై ప్రోఫెసర్ హరగోపాల్ కీలక వ్యాఖ్యలు..

Posted: 12/12/2017 10:17 AM IST
Professor haragaopal on ap ruling and opposition parties

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం సినీమా హీరోలు పార్టీలను స్థాపించి.. ఏకపక్షంగా అధికారంలోకి వచ్చే రోజులు కనుమరుగయ్యాయని రాజకీయ విశ్లేషకుడు, ప్రోఫెసర్ హరగోపాల్ అభిప్రాయపడ్డారు. ఇదే విషయం తాను చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించే క్రమంలోనే వ్యక్తం చేశానని అన్నారు. అయితే చిరంజీవిలో కూడా ప్రజలకు ఎంతో సేవ చేయాలని.. సమాజంలో మార్పు తీసుకురావాలన్న భావన ఉండిందని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపనకు మునుపే ఆయన ఈ విషయాలపై తనతో చర్చించారని అన్నారు. అయితే ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కల్యాన్ లో మాత్రం అన్నను మించిన అంకితభావం, తపన కనిపిస్తున్నాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కాగా, పవన్ కల్యాన్ పార్టీ రాష్ట్రంలోని అన్ని సీట్లకు పోటీ చేస్తుందా..? లేక ఎవరితో పోత్తు పెట్టుకుంటుందా..? అన్న విషయాలపై క్లారిటీ లేకపోవడంతో ఇప్పుడే తాను ఏమీ చెప్పలేనని అన్నారు. కాగా, నవ్యాంధ్రలో అధికారంలోని పార్టీ పాత మూసపద్దతిలో ప్రయాణించడం.. ఇక ప్రతిపక్ష పార్టీ వేగానికి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై నమోదైన కేసులను అడ్డుగా పెట్టుకుని, ఏ మాత్రం ఏమరపాటు లేకుండా అయనను ఇబ్బందుల పాటు చేసి వాటిని రాజకీయంగా వాడుకుంటున్నారన్న అభిప్రాయన్ని వ్యక్తం చేశారు.

దీంతో నవ్యాంధ్ర రాష్ట్రంలో ఇటు అధికార పక్షానికి కూడా ప్రజలకు దగ్గరగా లేదన్న ఆయన విపక్ష పార్టీ ప్రజలకు దగ్గరగా లేదని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార, విపక్ష పార్టీల బలాబలాలపై తన అభిప్రాయాలను పంచుకున్న ఆయన ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి పవన్ కల్యాన్ కు కొంత అవకాశం వుంటుందని అన్నారు. చంద్రబాబు ఇప్పటికీ పాత మూస పద్ధతిలోనే పరిపాలన సాగిస్తున్నారని, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయన మారడం లేదని అన్నారు. ప్రజా సంక్షేమంపై ఆయన సరైన విధంగా దృష్టి సారించడం లేదని అభిప్రాయపడ్డారు.

ఏపీలో పెద్ద సంఖ్యలో ఓటు బ్యాంకున్న క్రిస్టియన్లు, దళితులకు దగ్గర కావడం టీడీపీకి చేతకావడం లేదని తెలిపారు. ఇదే సమయంలో వైఎస్ జగన్ ను ప్రస్తావిస్తూ, తనపై ఉన్న అక్రమ కేసులు జగన్ కు ప్రతిబంధకాలని తెలిపారు. సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను కేసులు జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని తెలిపారు. వాటిని కేంద్రం అడ్డుగా పేట్టుకుని ఆయనను అన్ని రకాలుగా ఇరకాటంలోకి నెడుతున్నాయని, వాటితో అవి రాజకీయ లబ్దిని పోందాలని కూడా భావిస్తున్నాయని అన్నారు. ఈ కేసులన్నింటి నుంచి బయటపడటం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని పేర్కొన్నారు.

ఇక సరిగ్గా ఎన్నికల సమయంలో గతంలో జరిగిన మాదిరిగానే జగన్ ను కేసుల నేపథ్యంలో కటకలాల వెనక్కి పంపితే.. ఇటు టీడీపీకి ఓటు వేయలేక.. అటు వైసీపీకి ఓటు వేసినా జగన్ ముఖ్యమంత్రి కారన్న విషయాలను తెలుసుకన్న ప్రజలు జనసేనకు మద్దుతు ప్రకటించే అవకాశాలు వుంటాయని హారగోపాల్ అభిప్రాయపడ్డారు. దీంతో పవన్ పార్టీ జనసేన తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం సఫలం కావచ్చని కూడా హరగోపాల్ పేర్కోన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles