Stir over CBIT fee hike continues ఉదృతమౌతున్న సిబిఐటీ విద్యార్థుల అందోళన..

Chaitanya bharathi institute of technology students stage rally

Chaitanya Bharati Institute of Technology (CBIT), students agitation, fee hike, Javaji Dilip, General Secretary ABVP, Akhila Bharatiya Vidyarthi Parishad, CBIT, Hyderabad, Telangana

Scores of students in Hyderabad's Chaitanya Bharati Institute of Technology (CBIT) continued their agitation against the authorities over the fee hike for the sixth consecutive day.

ఉదృతమౌతున్న సిబిఐటీ విద్యార్థుల అందోళన.. ప్రిన్సిపాల్ ఘెరావ్..

Posted: 12/11/2017 05:56 PM IST
Chaitanya bharathi institute of technology students stage rally

రంగారెడ్డి జిల్లా గండిపేట్లోని చైతన్య భారతి ఇస్టిట్యూల్ అప్ టెక్నాలజీ (సీబీఐటీ) ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల ఆందోళన ఏడో రోజుకు చేరుకుంది. యాజమాన్యం ఏకపక్షంగా ఫీజుల పెంపు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పరీక్షలను సైతం బహిష్కరించిన విద్యార్థులు యాజమాన్యానికి వ్యతిరేకంగా అందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. కాలేజీ ఎదుట వందల సంఖ్యలో వస్తున్న విద్యార్థులు అక్కడే గుమ్మిగూడి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

ఇవాళ సిబిఐటీ విద్యార్థులు గండిపేట్ మెయిన్ రోడ్డు నుంచి సీబీఐటీ కాలేజ్ వరకు ర్యాలీ తీశారు. అందోళన చేస్తున్న విద్యార్థులకు ఏబీవీపీ నేతలు కూడా కలవడంతో అందోళన కార్యక్రమాలు మరింత ఉదృతంగా మారుతున్నాయి. ఇప్పటికే కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు వారం రోజుల పాటు సెలవులను ప్రకటించింది. అయినా విద్యార్ధులు కాలేజీకి వచ్చి తమ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. పెంచిన ఫీజును తగ్గించే వరకు ఆందోళన కొనసాగుతుందని విద్యార్థులు యాజమాన్యానికి తేల్చిచెబుతున్నారు.

మరోవైపు విద్యార్ధులు ఆందోళన విరమించాలని కోరారు సీబీఐటీ ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి.  విద్యార్ధుల డిమాండ్ పై సానుకూలంగా నిర్ణయం వచ్చేందుకు.. తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా విద్యార్ధులు ఒక్కసారిగా ప్రిన్సిపాల్ క్యాబిల్ లోకి దూసుకెళ్లారు. అక్కడి నుంచి అయనను కదలనీయకుండా ఘెరావ్ చేశారు. ప్రస్తుతం లక్షా 13 వేల రూపాయలుగా వున్న ఫీజును ఏకంగా రెండు లక్షలకు పెంచారని, ఇది ఏకంగా 74 శాతం అధికమని.. విద్యార్థి సంఘాలు నిలదీస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles