Accused In Alleged Molestation Of Actress Arrested దంగల్ నటిపై లైంగిక వేధింపులు.. అరెస్టు

Accused in alleged molestation of actress on vistara flight arrested

Vistara, molestation case, Bollywood actress, molestation on vistara flight, dungal, zaira wasim, molestation on celebrities, molestation on women, sexual assault on women, violence against women, air vistata

Mumbai police arrests man accused of molesting Bollywood Bollywood teenage actress DUNGAL fame Zaira wasim

దంగల్ నటిపై లైంగిక వేధింపులు.. అరెస్టు

Posted: 12/11/2017 10:27 AM IST
Accused in alleged molestation of actress on vistara flight arrested

నగరీకరణ తెలియని వలస జీవులు నగరంలో స్త్రీ, పురుషుల మధ్య సన్నిహిత్యంతో అబలలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని.. ఈ పరిస్థితిలో మార్పులు తీసుకువచ్చేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, నూతన చట్టాలు, చట్టాల్లో మార్పులు తీసుకొస్తున్నా, కఠిన చర్యలు తీసుకుంటున్నా అమ్మాయిలపై వేధింపులు ఆగడం లేదు. అయితే ఈ అంచానాలు కూడా తప్పని రుజువయ్యాయి. సాధారణ వలసజీవులే కాకుండా.. విలసాలకు అలవాటుపడి విమానాల్లో ప్రయాణాలు చేస్తున్న మృగాళ్లు కూడా వున్నారని ఇప్పటికే పలు సందర్భాలలో నిరూపితమైంది.

సంపన్న కుటుంబాల్లో పుట్టి.. స్త్రీ పురుషుల మధ్య సన్నిహిత్యం గురించి తెలిసిన వారు కూడా పోకిరీల మాదిరిగా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ జాబితాలో సెలబ్రిటీలను సైతం వున్నారంటే పురుషాధిక్య సమాజంలో అడవాళ్లు బతుకులు ఎంత దారుణంగా మారిపోయాయో అర్థం చేసుకోవచ్చు. రోడ్లు, బస్సులు, బైకులు, పాదచారులపైనే కాదు...ఆఖరికి విమానాల్లోనూ వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలా వేదింపులకు గురైన సెలబ్రిటీల జాబితాలో దంగల్ నటి జైరా వసీమ్ కు చేరింది. అమె ప్రయాణిస్తున్న విమానంలో ఒక మగమృగం పైశాచికత్వాన్ని ప్రదర్శించింది.

దీనిపై సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసిన అమె తన అవేదనను కూడా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో ప్రకంపనలు సృష్టించడంతో రంగంలోకి దిగిన జాతీయ మహిళా కమీషన్ అమెకు అండగా నిలిచింది. వెంటనే అమె వెనుక కూర్చున్న వ్యక్తి తాలుకు వివరాలను తెలియజేయాల్సిందిగా అదేశించింది. సహచర ప్రయాణికుడు ఆమెను లైంగికంగా వేధించాడు. ఫ్లైట్‌ ఎక్కినప్పటి నుంచి దిగేవరకూ అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో వేధింపులపై జైరా వసీమ్ కన్నీటి పర్యంతమైంది. ఎలా వేధించాడో వివరిస్తూ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసింది.

ఢిల్లీ నుంచి ముంబై వెళ్లేందుకు విస్తారా ఫ్లైట్‌ ఎక్కిన జైరాను వెనుక సీట్లో కూర్చున్న ప్రయాణికుడు పదేపదే ఇబ్బంది పెట్టాడు. ఫ్లైట్‌ ఎక్కినప్పటి నుంచి దిగేవరకూ కాళ్లూచేతులతో జైరాను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. వేధింపులను సోషల్ మీడియా ద్వారా జైరా బయటపెట్టడంతో విస్తారా ఎయిర్ లైన్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అవేదనతో అమె తన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో తమ ఎయిర్ లైన్స్ లో ఇలాంటి ప్రవర్తనను సహించబోమన్న... విస్తారా.... జైరాకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటించింది. అయితే జైరాతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడ్ని... ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles