Gujarat witnesses 68% turnout in phase one elections ప్రధాని పిలుపును అందుకోని గుజరాత్ ఓటరు..

Gujarat phase 1 polling witnesses 68 turnout amid evm glitches

Gujarat elections 2017, voter, Gujarat Assembly elections 2017, bharatiya janata party, Congress, Vijay Rupani, Narendra Modi, Arjun Modhwadia, Election Commission, Jitu Vaghani, Lok Sabha, Shaktisinh Gohil, evms, Election Commission (EC), VVPAT, Hardik Patel

More than 68% voter turnout, the highest in many years and little lower than 72% recorded in the 2012 polls, was recorded in the first phase of the crucial Gujarat Assembly elections

ప్రధాని పిలుపుకు భిన్నంగా స్పందించిన గుజరాత్ ఓటరు..

Posted: 12/09/2017 08:11 PM IST
Gujarat phase 1 polling witnesses 68 turnout amid evm glitches

గుజ‌రాత్‌లో తొలిద‌శ‌ అసెంబ్లీ ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు క్యూలైన్ల‌లో ఉన్న వారికి ఓటు వేసే అవ‌కాశం క‌ల్పించారు. సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ శాతం సుమారు 65గా న‌మోదయింది. అయితే గత రెండు దశాబ్దాలకు పైగా గుజరాత్ ఓటరు కషాయ పార్టీకి ఓటువేస్తూ.. మూడు పర్యాయాలు ప్రధాని నరేంద్రమోడీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారంలోకి తీసుకువచ్చింది. కాగా, ఈ ఎన్నికలలో మాత్రం గుజరాత్ ఓటరు ప్రధాని పిలుపును అందుకోలేదు. అయన ఇచ్చిన పిలుపుకు భిన్నంగా స్పందించారు.

గత ఎన్నికలలో తొలిదశ పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో 72 శాతం ఓటింగ్ నమోదు కాగా. ఈ సారి మాత్రం ఇది కేవలం 64 నుంచి 66 మధ్య మాత్రమే కొనసాగనుంది. సౌరాష్ట్ర‌, ద‌క్షిణ గుజ‌రాత్‌లోని మొత్తం 89 స్థానాల‌కు ఈ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ నెల 14 న మిగిలిన 93 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 18న ఓట్ల లెక్కింపు ఉంటుంది. గుజ‌రాత్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు కూడా చేసుకున్న విష‌యం తెలిసిందే.

2012 గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో  సౌరాష్ట్ర‌, ద‌క్షిణ గుజ‌రాత్‌లోని మొత్తం 89 స్థానాల్లో 63 నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ గెలుపొంద‌గా, 22 స్థానాల్లో కాంగ్రెస్ విజ‌యం సాధించింది. నాలుగు స్థానాల్లో ఇత‌రులు గెలుపొందారు. అయితే ప్రధాని పిలుపుకు మేము మాత్రం అచరిస్తామని వచ్చారో లేక తమ హక్కును వినియోగించుకునేందుకు వచ్చారో తెలియదు కానీ.. గుజరాత్ ఎన్నికలలో తొలి విడత ఎన్నికల్లో పెళ్లి జంట‌లు విచ్చేశాయి. సూర‌త్‌లో క‌తార్గాం పోలింగ్ కేంద్రంలో ముఖానికి ప‌సుపుతో ఫెన్నీ ఫ‌రేఖ్ అనే మ‌హిళ ఓటు వేయ‌డానికి వ‌చ్చింది.

అలాగే భ‌రూచ్ పోలింగ్ కేంద్రంలో ఇవాళ పెళ్లి చేసుకుంటున్న ఓ జంట పెళ్లి బ‌ట్ట‌ల‌తో హాజ‌రై త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అలాగే రాజ్‌కోట్‌లోని ధార‌ళా గ్రామంలో మ‌మ‌తా గొండాలియా అనే యువ‌తి పెళ్లి కూతురిగా వ‌చ్చి ఓటు వేసింది. వీరి ఫొటోలు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారాయి. కొంత‌మంది ప్రజాస్వామ్యం పట్ల వీరికున్న బాధ్య‌త‌ను పొగిడేస్తుంటే... మ‌రికొంత మంది మాత్రం ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షించ‌డానికి ఈ ప్ర‌య‌త్నం అంటూ పెద‌వి విరుస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gujarat elections 2017  voter  bjp  Congress  Narendra Modi  Election Commission  evms  VVPAT  

Other Articles