pawan kalyan alleges tonsure is tdp wrong propaganda అది టీడీపీ ప్రచారమే.. అదే జరిగితే ఊరుకునేవాడినా.?

Pawan kalyan alleges tonsure is tdp wrong propaganda

Jana Sena, Pawan Kalyan, chalore chalore chal, TDP leaders, wrong propaganda, paritala ravi, tonsure, gundu, ethnic qualities, fatima students, fatima medical college, fatima students pawan kalyan, caste, Indian, human, rajamundry, party activists, telugu states tour, political tour,Andhra Pradesh

Jana Sena founder president and chief Pawan Kalyan alleges telugu desam party for wrong propaganda on his tonsure (gundu).

అది టీడీపీ ప్రచారమే.. అదే జరిగితే ఊరుకునేవాడినా.?

Posted: 12/08/2017 06:16 PM IST
Pawan kalyan alleges tonsure is tdp wrong propaganda

ప్రజాహితం కోసం అలోచించే వ్యక్తిని కాబట్టే తనపై పెద్ద అభాండాన్ని వేసి.. ప్రచారం చేసినా.. తాను టీడీపీకి మద్దతునిచ్చానని చెప్పారు సినీనటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్. తాను తమ్ముడు చిత్రం షూటింగ్ లో భాగంగా బిహెచ్ఈఎల్ లో వుండగా, తన చెవిన ఈ వార్త పడిందని అన్నారు. తన చిన్న అన్న నాగేంద్రబాబు తనకు ఫోన్ చేసి.. పరిటాల రవి నీకు తెలుసా..? నిన్న ఆయన తనతో తీసుకెళ్లారా..? అని అడిగారు. దాడి చేసి గుండు కొట్టించాడా..? అని కూడా అడిగారని అలా తన చెవిన ఈ విషయం పడిందని చెప్పారు.

దీంతో విస్మాయానికి గురైన తాను అసలు పరిటాల రవి ఎవరు.. తనకెందుకు గుండు చేయిస్తారు..? అని అడిగానని చెప్పారు. ఇలా తనకు గుండు చేయించారనే వార్త అటు చిత్రసీమలోనే ఇటు రాజకీయాలలోనూ హాట్ టాపిక్ గా మారిందని, అయితే అవన్నీ కేవలం అభూత కల్పనలే అని కొట్టి పారేశారు. కొందరు టీడీపీ నేతలు కావాలని తనపై ఈ తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. కానీ తనకు ఎవరో గుండు కొట్టించారనే వార్తలు కూడా వచ్చాయని అన్నారు. సినిమాలపై విసుగుతోనే తాను అనుకున్న హెయిర్ స్టైల్ రాక కోపంలో చికాకుతో తానే గుండు చేయించుకున్నానని చెప్పారు.

ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన టీడీపీ నేతలు తనకు ఇప్పటికీ కనిపిస్తుంటారని అన్నారు. కానీ అవేవీ నేను మనసులో పెట్టుకోలేదని చెప్పారు. అన్నింటి కంటే ముఖ్యంగా.. మనకు కావాల్సింది ప్రపంచ స్థాయి రాజధాని, కులాల మధ్య ఐక్యత. అందుకే మనసులో పెట్టుకోలేదు, వ్యక్తిగతంగా తీసుకోలేదని పవన్ తెలిపారు. కమ్మ ఆడపడుచులకు అన్యాయం జరిగినా.. పవన్ కల్యాన్ కు భాదేస్తుందన్నారు. అయితే తెలంగాణలో వెతికితే కాని కనిపించని కుల పిచ్చి.. అంధ్రప్రదేశ్ లో మాత్రం బాగా పేరుకుపోయిందని విమర్శించారు. కులం కూడు పెడుతుందా.? అని అయన ప్రశ్నించారు. డబ్బుంటేనే కులం అని తన మనసులోని భావాలను పవన్ కల్యాన్ బయట పెట్టాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jana Sena  Pawan Kalyan  TDP leaders  wrong propaganda  paritala ravi  tonsure  gundu  ethnic qualities  politics  

Other Articles