Pawan's assures support to Fatima Students movement ఫాతిమా కాలేజ్ వైద్యవిద్యార్థులకు పవన్ అభయహస్తం..

Pawan s assures support to fatima students movement

Jana Sena, Pawan Kalyan, chalore chalore chal, fatima students, fatima medical college, fatima students pawan kalyan, polavaram project, east godavari, west godavari, R Krishanaih, caste, Indian, human, rajamundry, party activists, telugu states tour, political tour,Andhra Pradesh

Jana Sena leader Pawan Kalyan is also ready to lead student movements to address their problems in Andhra Pradesh. The Jana Sena leader declared at a meeting with Fatima Medical college students that he will stand by the students agitation until they get justice.

ఫాతిమా కాలేజ్ వైద్యవిద్యార్థులకు పవన్ అభయహస్తం..

Posted: 12/08/2017 03:04 PM IST
Pawan s assures support to fatima students movement

ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులు సాగిస్తున్న పోరాటానికి సినీనటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ స్పందించారు. విద్యార్థులు గత కొన్ని నెలలుగా సాగిస్తున్న పోరాటానికి పవన్ కూడా మద్దతు ప్రకటించారు. ఇన్నాళ్లు ఏ రాజకీయ నాయకుడి అండ లభించక విద్యార్థులుగా సాగిస్తున్న ఉద్యమానికి జనసూనాని అభయహస్తాన్ని అందించడంతో కొండంత అండ లభించినట్లైంది. మైనారిటీ విద్యార్థుల కోసం మెడికల్ సీట్లను తీసుకువచ్చామని.. అది తమ ఘనతగా చెప్పుకున్న టీడీపీ ప్రభుత్ం.. వారి సమస్యలను పరిష్కరించడంలో మాత్రం ఏమాత్రం చిత్తశుద్ది లేకుండా వ్యవహరించిందని దుయ్యబట్టారు.

కౌన్సిలింగ్ లో సీట్లు వచ్చిన తరువాత తాము కళాశాలలో చేరితే తమనే దోషులుగా చేస్తున్నారని విద్యార్థలు తమ అవేదనను జనసేనాని ఎదుట వినిపించారు. ప్రభుత్వం తను లాంగ్ టర్మ్ కోచింగ్ కు పంపతామని చెబుతుందని, తాము వెళ్తామని, అయితే తమకు ర్యాంకు రాని పక్షంలో ప్రభుత్వం తమ భవిష్యత్తుకు ఎలాంటి భరోసాను ఇస్తుందని విద్యార్థులు ప్రశ్నించారు. దీంతో ఫాతిమా వైద్య కళాశాలలో చదువుతున్న విద్యార్థుల ఉద్యమానికి తాను మద్దతునిస్తున్నట్లు పవన్ కల్యాన్ ప్రకటించారు. తప్పు చేయని విద్యార్థులకు శిక్ష వేయడం సరికాదని అన్నారు. కళాశాల యాజమాన్యం చేసిన తప్పులకు విద్యార్థులను శిక్షిస్తారా? అని ప్రశ్నించారు.

విజయవాడలో ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులు, తల్లిదండ్రులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థుల సమస్యలపై మంత్రి కామినేనితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుందన్నారు. విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించేందుకైనా వెనుకాడనని ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్ నాశనమవుతుంటే చూస్తూ కూర్చోనని స్పష్టం చేశారు. వారం రోజుల్లో తప్పనిసరిగా న్యాయం చేస్తానని పేర్కొన్నారు. మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తే జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులు పవన్ తో మాట్లాడుతూ మరో నెల రోజుల్లో పరీక్షలు ఉన్న సమయంలో తమ ప్రవేశాలను రద్దు చేశారని తెలిపారు. కళాశాల యాజమాన్యం మోసం చేసిందని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles