OU student murali deadbody reaches home మురళి ఆత్మహత్యకు అసలు కారణం..?

Actual reason behind osmaina university student murali suicide

Osmania University, OU student murali suicide, OU student Murali, students under pressure, Murali friends, OU student suicide, murali, unemployement., suicide, academic pressure

what is the actual reason behind Osmania University student murali as suicide note says he is under heavy pressure, but friends allege that unemployement.

ఓయు విద్యార్థి మురళి ఆత్మహత్యకు అసలు కారణం..?

Posted: 12/04/2017 10:13 AM IST
Actual reason behind osmaina university student murali suicide

రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కాళాశాల విద్యలే విద్యర్థులను ఆత్మహత్యలపైవు ఉసిగొల్పుతున్నాయని అరోపణలు వచ్చిన క్రమంలో తాజాగా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుల తీవ్ర ఒత్తడి భరించలేక ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. ఉస్మానియా యూనివర్సిటీలోని మానేరు హాస్టల్ లో రూమ్ నెంబర్ 159లో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి మురళి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయ్యింది. దీంతో విద్యార్థి బౌతికకాయాన్ని అతని స్వస్థలం సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలంలోని దౌలాపూర్ తరలించారు.

అయితే ‘‘చదువులో తాను తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోంటున్నానని.. ఇక తాను ఈ ఒత్తడిని భరించలేనని.. తనకు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని వుందని.. అందరినీ విడిచి వెళ్తున్నందుకు బాధగా వుందని, అమ్మ నన్ను క్షమించు’’ అని పేర్కొంటూ మురళి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. ఈ సూసైడ్ నోట్ ను అతని స్నేహితులు కూడా చదివారని వారు చెబుతున్నారు. కాగా, నిరుద్యోగ సమస్యే మురళి ఆత్మహత్యకు కారణమని అతని స్నేహితులు ఆరోపిస్తున్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలంయలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ చదువతున్న మురళి ప్రభుత్వ ఉద్యోగం కోసం అహర్నిషలు కష్టపడి చదివాడని, అయినా ఉద్యోగం రావడం లేదని మనస్థాపంతో తనువు చాలించాడని మిత్రులు అరోపిస్తున్నారు. అతని బౌతికకాయం స్వగ్రామానికి చేరడంతో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వంత జిల్లా, స్వంత నియోజకవర్గంలో విద్యార్థి నిరుద్యోగ సమస్యతో అత్మహత్యకు పాల్పడటంతో బంగారు తెలంగాణ అంశాన్ని ప్రశ్నిస్తున్నట్లుందని పలువురు రాజకీయ నేతలు కూడా విమర్శలు గుప్పించారు. పలువురు ఉస్మానియా విద్యార్థులు కూడా మురళి స్వగ్రామంలో జరుగనున్న అంత్యక్రియల కసం హాజరయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : osmania university  student suicide  Murali  siddipet  academic pressure  

Other Articles