కాంగ్రెస్ పార్టీ నేత, ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజ్ బబ్బర్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు తాను హిందువునని చెప్పుకుంటున్నా అమిత్ షా అసలు హిందువే కాదని సంచలన అరోపణలు చేశారు. అమిత్ షా హైందవుడిగా ప్రచారం చేసుకుంటున్నారే తప్ప అసలు అయన హిందువు కాదని అన్నారు. ఆయన జైన మతస్తుడు అని అరోపించారు.
ముంబైలోని జైన కుటుంబంలో అమిత్ షా పుట్టారని... ఆ తర్వాత గుజరాత్ కు వచ్చి సెటిలయ్యారని తెలిపారు. అయన హిందువుడా, లేక జైనుడా అన్న విషయమై ముందుగా తేల్చాల్సిన అవసరముందని అన్నారు. అమిత్ షా కపటి హిందువు నాటకాలను కట్టిపెట్టాల్సిన అవసరం వచ్చిందని అన్నారు. అయన నిజ స్వరూపం బట్టబయలు చేస్తామని.. మరి ఇందుకు అమిత్ షా సిద్దమేనా అని రాజబబ్బర్ సవాల్ విసిరారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రారంభమైన ఈ మతాల గొడవ అటుఇటు తిరిగి చివరకు అమిత్ షాకే చుట్టుకుంది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాహుల్ గాంధీ సోమ్ నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నాన్ హిందూ డిక్లరేషన్ బుక్ లో సంతకం చేశారంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. తెలియక లేడిస్ టాయ్ లెట్ లోకి వెళ్లిన అంశంపైనా బీజేపి నేతలు రాజకీయం చేసి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారని, మరీ మతమార్పిడులకు వ్యతిరేకమని వాదిస్తున్న బీజేపి మాత్రం హిందువే కాని వాడిని అధ్యక్షుడిగా ఎలా చేసుకుందని రాజ్ బబ్బర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more