Rahul Gandhi promises farm loan waiver రాహుల్ వెంట కదులుతున్న గుజరాత్ రైతాంగం

Rahul gandhi promises farm loan waiver free college education

Amreli, Bhavnagar, BJP, Congress, Gujarat Assembly Election 2017, Gujarat Assembly Election 2017 Narendra Modi, Gujarat Assembly Election 2017, Rahul Gandhi, Gujarat polls, Lathi, Rahul Gandhi, farmers, loan waiver, free college education, assembly polls, gujarat, politics

Rahul Gandhi tour of poll-bound Gujarat with a promise to waive loans of farmers and provide free education in government-aided colleges if the Congress party comes to power in the state.

రాహుల్ వెంట కదులుతున్న గుజరాత్ రైతాంగం.. ఎందుకు..?

Posted: 12/01/2017 06:54 PM IST
Rahul gandhi promises farm loan waiver free college education

యావత్ దేశంతో పాటు ప్రపంచం కూడా అసక్తికరంగా ఎదురుచూస్తున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అత్యంత కీలకమైన రెండు హామీలను ఇచ్చి.. మరింత జోరందుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ర్యాలీ అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్న వార్తల నేపథ్యంలో గుజరాత్ కాంగ్రెస్ శ్రేణులు మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ప్రచార కార్యక్రమాలను వేగాన్ని పెంచుతున్నారు. దాదాపు రెండు దశాబ్దాల కాషాయ పార్టీని నుంచి పాలనా పగ్గాలను అదుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నారు.

ఇప్పటికే పటిదార్ సహా పలు కులసంఘాల మద్దతును కూడగట్టుకున్న కాంగ్రెస్.. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ.. అంచనాలపై కాకుండా గుజరాత్ ఫలితాలను క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. సర్వేలు, అంచనాలు ఎన్నికలకు ముందు ఒకలా, తరువాత మరోలా మారిపోతాయని పలు రాష్ట్రాల ఎన్నికలలో స్పష్టమైన నేపథ్యంలో వాటిని పరిగణలోకి తీసుకోకుండా విజయమే లక్ష్యంగా పట్టుకుని ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని ఇప్పటికే రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ప్రధాని మోదీ సొంత రాష్ట్రం కావడంతో ఇక్కడ ఎలాగైనా పాగా వేయాలనీ... వీటి నుంచే వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపాలని కాంగ్రెస్ వ్యూహాలను రచిస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ... తాజాగా అక్కడి ప్రజలకు మరో రెండు భారీ హామీలు ప్రకటించారు. గుజరాత్ లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతు రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని హామి ఇచ్చారు. ఈ హామీతో గుజరాత్ రైతాంగం కాంగ్రెస్ కు బాసటగా నిలవనుంది. ఇప్పటికే 2004లో దేశవ్యాప్తంగా రుణాలను మాఫి చేసిన చరిత్ర వున్న కాంగ్రెస్ హమీని తప్పక నెరవేర్చనున్నట్లు రైతులు అభిప్రాయపడుతున్నారు.

దీంతో పాటు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో కూడా విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారు. ఒక దేశం ఒకే విద్యా విధానంపై ప్రధాని మోడీ చూపిన శ్రద్ద.. విద్యను వ్యాపారంగా కాకుండా కనీస అవసరంగా చేయాలని మాత్రం యోచించడం లేదని విమర్శించారు. మానవ వనరుల అభివృద్దిపై ప్రసంగాలు చేస్తే అవి అభివృధ్ది చెందవని, అందుకు తాము ఇస్తున్న హామీలే కార్యచరణ అని కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీ తన ‘‘5-10 మంది బడా పారిశ్రామిక మిత్రులకు’’ మాత్రమే రూ. 1.25 లక్షల కోట్లు రుణమాఫీ చేశారనీ... పేద రైతులకు మాత్రం రుణమాఫీ చేసేందుకు ఆయనకు చేతులు రాలేదని రాహుల్ దుయ్యబట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  PM Modi  congress  BJP  farmers  loan waiver  free college education  assembly polls  gujarat  politics  

Other Articles