ED conducts raids in premises of Chidambaram's kin చిదంబరం బంధువుల ఇళ్లపై ఈడీ సోదాలు..

Ed conducts raids in premises of chidambaram s kin

Aircel Maxis case, P Chidambaram, Karti Chidambaram, S Kailasam, maternal uncle of Karti Chidambaram, foreign direct investment, Manoj Mohanka, Cabinet Committee on Economic Affairs, money laundering, S Sambamoorthy, Ramji Natarajan, Manoj Mohanka, TV18 former chairman, ,crime, law and justice ,economic offence

The Enforcement Directorate conducted raids in Chennai and Kolkata, including at the premises of a relative of former Finance Minister P Chidambaram, in connection with its money laundering probe in the Aircel-Maxis case,

చిదంబరం బంధువుల ఇళ్లపై ఈడీ సోదాలు..

Posted: 12/01/2017 12:59 PM IST
Ed conducts raids in premises of chidambaram s kin

అధికారంలో వున్న సమయంలో తమ అధికారాన్ని వినియోగించుకుని అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాల నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం బంధువుల ఇళ్లపై ఎన్ ఫోర్స్ మెట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేపట్టారు. ఎయిర్ సెల్-మ్యాక్సిస్ కేసులో నిధులు మళ్లింపులు జరిగాయన్న అభియోగాలపై కార్తి చిదంబరానికి చెందిన నాలుగు ప్రాంతాలతో పాటు చిదంబరం బంధువుల ఇంటిపై కూడా ఈడీ దాడులు నిర్వహించి సోదాలు చేస్తుంది.  చెన్నైలోని నాలుగు ప్రాంతాల్లో, కోల్‌కతాలోని రెండు ప్రాంతాల్లో ఇవాళ ఉదయం నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

2006లో జరిగిన ఎయిర్ సెల్‌-మ్యాక్సిస్‌ ఒప్పందంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఎయిర్ సెల్ లో 80మిలియన్ డాలర్ల (దాదాపు రూ.3500కోట్లు) పెట్టుబడులు పెట్టడానికి మారిషస్ కు చెందిన మ్యాక్సిస్‌ కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. అయితే రూ. 600కోట్ల పైబడిన విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇచ్చే అధికారం ప్రధానమంత్రి నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీకి మాత్రమే ఉండగా.. అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం సొంతంగా నిర్ణయం తీసుకుని అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ విషయంపై కేసు నమోదైంది.

కాగా.. ఈ కేసులో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంపైనా ఆరోపణలు వచ్చాయి. కార్తి చిదబరం.. తండ్రి అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని తమనుంచి డీల్ తీసుకున్నారని అభియోగాలను అప్పట్లో ఎయిర్ సెల్ సంస్థ అరోపించింది. దీంతో విచారణ చేపట్టిన ఈడీ అధికారులు.. తాజాగా సోదాలు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles