man enters metro station with liquor bottle మెట్రో రైలుకు రెండో రోజు తొలి విఘ్నం..

Man not allowed to enter with water bottle steps in with liquor bottle

ameerpet metro station, water bottle, liqour bottle, passengers, man enters metro station with liquor bottle, ameerpet metro station liqour bottle, metro rail single service, metro train Shedule, metro rail services, metro rail rates, pm modi metro rail, miyapur, kukatpally, metro rail project, telangana

man not allowed to enter with water bottle into ameerpet metro station on the second day, steps in with liquor bottle in revenge on police

అమ్మ పెట్టదు.. తిననివ్వదు.. అందుకే మద్యం బాటిల్..

Posted: 11/30/2017 05:35 PM IST
Man not allowed to enter with water bottle steps in with liquor bottle

అమ్మా పెట్టా పెట్టదు.. అడక్కు తిననివ్వదూ అంటూ ఓ సామెత ఆ మెట్రో రైలు ప్రయాణికుడికి కోపాన్ని తెప్పించింది. దీంతో సదరు ప్రయాణికుడు ఏకంగా మధ్యం బాటిల్ తో అమీర్ పేట్ మెట్రో స్టేషన్‌లోకి ఎంటరయ్యాడు. తన వద్ద మద్యం బాటిల్ వుందని చూపుతూ అక్కడి ప్రయాణికులను అందోళనకు గురిచేశారు. దీంతో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన మెట్రలో రైలు సర్వీసులకు రెండో రోజునే తొలి విఘ్నం ఏర్పడినట్లు అయ్యింది. ఎందకయ్యా మద్యం బాటిల్ ను తీసుకుని స్టేషన్ లోకి వచ్చి కలకలం రేపావు అంటే.. తనకు పట్టరాని కోపం వచ్చిందన్నాడు.

అయితే అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎవరిపైన కోపం వచ్చిందయ్యా అని విచారిస్తే.. మీ పైనే అంటూ ప్రయాణికుడు పోలీసులనే చూపించాడు. దీంతో అసలేం జరిగిందన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు పోలీసులు.. మెట్రో రైళ్లలో ఏసీ వుంటుందని ప్రకటించిన ప్రభుత్వం.. మెట్రో స్టేషన్ లో చల్లటి తాగునీరు కూడా ఏర్పాటు చేసి వుంటుందని భావించిన అతను టికెట్ తీసుకుని స్టేషన్ లోకి వచ్చాక.. తాగేనీరు ఎక్కడా అని అడిగితే అక్కడి సిబ్బంది బయటికి వెళ్లి తెచ్చుకోమని బదులిచ్చారు.

దీంతో విస్మయానికి గురవుతూ బయటకు వచ్చిన ప్రయాణికుడు తీరా వాటర్‌ బాటిల్ కనుక్కుని లోనికి వస్తుండగా పోలీసులు త‌న‌ను లోపలికి రానివ్వలేదని చెప్పాడు. అందుకే త‌న‌కు ఆగ్రహం వచ్చింద‌ని, వెళ్లి లిక్కర్ బాటిల్ కొనుక్కుని మెట్రో స్టేషన్ లోకి వ‌చ్చాన‌ని చెప్పాడు. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. మెట్రో రూల్స్ ప్రకారం న‌డుచుకోవాల‌న్న అదేశాలను మీరినందుకు అతడ్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అయితే వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు అని గోప్పలకు పోతున్న ప్రభుత్వం, జీహెచ్ఎంపీ, మెట్రో రైల్, ఎల్ అండ్ టీ సంస్థలు.. ప్రయాణికులకు కనీసం మంచినీళ్లు కూడా ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : metro rail  hyderabad  ameerpet metro station  water bottle  liqour bottle  passengers  telangana  

Other Articles