Girls Forced to Undress for 'Vulgar Note' కాగితం కోసం విద్యార్థినుల బట్టలిప్పిస్తారా.?

88 girls forced to undress as punishment for vulgar note in arunachal school

arunachal pradesh, arunachal pradesh school, arunachal school, Kasturba Gandhi Balika Vidyalaya, Papum Pare, school punishment, Girls Forced to Undress, girls punished to undress, teachers humiliated students, girl students humilitated by forced undressing, undress, school girls, vulgur note, balika vidyalaya, tani happa, papum pare, arunachal pradesh

Eighty-eight students of Classes 6 and 7 of Kasturba Gandhi Balika Vidyalaya, Tani Happa (New Sagalee) in Papum Pare district were subjected to the humiliating treatment

అవమానం: కాగితం కోసం విద్యార్థినుల బట్టలిప్పిస్తారా.?

Posted: 11/30/2017 11:39 AM IST
88 girls forced to undress as punishment for vulgar note in arunachal school

నేటి బాలబాలికలను సభ్య సమాజం గౌరవించేలా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు.. తాము ఎలాంటి విధులకు ఎంపికయ్యమాన్న విషయాన్ని మర్చిపోయి.. విజ్ఞత, సంస్కారం లేకుండా అసభ్య చర్యలకు పా్ల్పడిన ఘటన అరుణాచల్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. పిల్లల వద్ద అహంభావం ప్రదర్శించిన ఉపాధ్యాయులు.. వారికి అత్యంత దారుణంగా అవమానించారు. సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న ఘటనలను ప్రతిరోజు వింటూ, చూస్తు వున్నా వీరిలో ఏ మాత్రం మార్పు రాలేదు. నవంబర్ 23న జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో తల్లిదండ్రులు ఉపాధ్యయుల వైఖరిపై తీవ్ర అందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఓ కాయితం ముక్క కోసం అహం దెబ్బతిన్న ఉపాధ్యాయులు బాలికలకు అత్యంత దారుణమైన శిక్షను విధించింది. తమ క్లాస్ టీచర్ పై అసభ్యరాతలు రాశారన్న ఆరోపణలపై 88 మంది ఆరు, ఏడు తరగతుల అమ్మాయిలను బలవంతంగా బట్టలు తీయించి నిలబెట్టింది. పాపుమ్ పారే జిల్లాలోని తాని హప్పాలో ఉన్న కస్తూర్భా గాంధీ బాలికా వైద్యశాలలో ఈ దారుణం జరిగింది. గత వారంలో ఈ ఘటన జరుగగా, బాధిత బాలికలు ఆల్ సగాలీ స్టూడెంట్స్ యూనియన్ సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉదంతం వెలుగులోకి వచ్చింది.

ఫిర్యాదులోని వివరాల ప్రకారం, ఇద్దరు అసిస్టెంట్ టీచర్లు, ఓ జూనియర్ టీచర్ కలిసి ఈ పని చేయించారు. క్లాస్ టీచర్ పై ఓ స్టూడెంట్ అసభ్య రాతలు రాయగా, ఆ కాగితం ముక్క కోసం మిగతా విద్యార్థుల ముందు బట్టలు ఊడదీయించారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పితే ఏకంగా పాఠశాల నుంచి టీసీ ఇచ్చి పంపిచేస్తామని హెచ్చరించారు. ఈ ఘటన నిజమేనని, కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటన దారుణమని అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో పాలన జరుగుతున్న తీరుకు ఇటువంటి ఘటనలు నిదర్శనమని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : undress  school girls  vulgur note  balika vidyalaya  tani happa  papum pare  arunachal pradesh  

Other Articles