Most Unsuccessful Candidate in RK Nagar By-election | గెలుపే తెలియని వీరుడు ఆర్కే నగర్ బరిలో...

Election king again in news

RK Nagar By-Election, K Padmarajan, All Indian Election King, Most Unsuccessful Candidate, Election King in India, Most Elections Participant

K Padmarajan, the man who has contested in over 180 elections, will be in action once again with RK Nagar By-Election. The Limca Book of Records terms him as the ‘Most Unsuccessful Candidate’.

ఆల్ ఇండియా ఎలక్షన్ కింగ్.. మళ్లీనా?

Posted: 11/30/2017 09:11 AM IST
Election king again in news

ఓటమి గెలుపునకు నాంది అన్న పదానికి బాగా ఫిక్సయినట్లు ఉన్నాడు. అందుకే ఏ ఎన్నిక అయినా సరే అక్కడ వాలిపోయి.. పోటీ చేస్తుంటాడు కె. పద్మరాజన్. తమిళనాడులోని సేలంకు చెందిన వైద్యుడు ఈయనగారు. 1988లో తొలిసారి ఎన్నికల్లో పాల్గొన్న ఆయన ఈ ముప్పై ఏళ్లలో ఎక్కడ ఎలక్షన్ అంటే అక్కడ కనిపిస్తున్నారు.

దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా సరే పోటీ చేయడం ఈయనకు అలవాటు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు దేనినీ వదలరు. ప్రతి ఎన్నికలోనూ పోటీ చేస్తారు. కానీ, ప్రచారం లాంటివి అస్సలు చెయ్యరు. ఇప్పటి వరకు 183 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన తాజగా 184వ సారి బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆర్కే నగర్ నియోజకవర్గానికి డిసెంబరు 21న ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసేశారు కూడా.

1988లో తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ఆయన.. ఆ తర్వాత మాజీ రాష్ట్రపతులు కేఆర్ నారాయణన్, అబ్దుల్ కలాం, ప్రతిభాపాటిల్‌పై పోటీకి నామినేషన్లు వేశారు. మన్మోహన్ సింగ్, వాజ్‌పేయి, జయలలిత, కరుణానిధి, పీవీ నరసింహారావు లాంటి రాజకీయ ఉద్ధండులపైనా పోటీ చేశారు.1991లో పీవీకి వ్యతిరేకంగా నామినేషన్ వేసినప్పుడు ఆయనపై దాడి కూడా జరిగింది. అయినా ఆయన పంథా మార్చుకోలేదు. 183 సార్లు పోటీ చేసినా ఒక్కసారి కూడా గెలవలేకపోయారు. అలాగని పోటీ చేయడం మానలేదు.

ప్రజాస్వామ్యాన్ని నిరూపించడమే తన లక్ష్యమని చెప్పే పద్మరాజన్ ఎన్నికల్లో ఎక్కువసార్లు పోటీ చేసి ఓడిన వ్యక్తిగా గిన్నిస్ బుక్,లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కారు. ఆయనను అందరూ ‘ఆల్ ఇండియా ఎలక్షన్ కింగ్’గా ముద్దుగా పిలుచుకుంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles