Nestle India, distributors fined in Uttar Pradesh మళ్లీ మ్యాగీ నూడుల్స్ కు చిక్కులు.. భారీ జరిమానా..

Maggi fails lab test in up nestle india imposed fine of rs62 lakh

Maggi Noodles, Nestle, test, FSSAI, Uttar Pradesh , Business Standard , Companies, Maggie, fmgc, nestle products, Maggie in India, Indian fast food, Shahjahanpur, Shahjahanpur administration, Uttar Pradesh, Uttar Pradesh news, breaking news, top news, latest news, Nestle Maggi, Maggi,Nestle,Maggi noodles,Maggi ban,Nestle India fine

Maggi noodles have again failed to pass the lab test. Failing to pass the test, Nestle has been fined Rs. 62 lakh by the district administration in Uttar Pradesh's Shahjahanpur over the contamination of samples.

మళ్లీ మ్యాగీ నూడుల్స్ కు చిక్కులు.. భారీ జరిమానా..

Posted: 11/29/2017 12:00 PM IST
Maggi fails lab test in up nestle india imposed fine of rs62 lakh

నెస్ట్లీ ఇండియా సంస్థ ద్వారా తయారవుతున్న మ్యాగీ నూడుల్స్ కు మళ్లీ చిక్కుల్లో పడింది. మరోమారు ల్యాబ్‌ టెస్టుల్లో విఫలం చెందింది. అంతేకాదు.. ఈ అంశంలో భారీ జరిమానాను కూడా చెల్లించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఉత్తర్ ప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో గల అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కోర్టు నెస్ట్లీ సంస్థతో పాటు సంస్థ తరపున డిస్ట్రబ్యూషన్ తీసుకున్న రెండు ఏజెన్సీలతో పాటు.. వాటిని అలాగే విక్రయించిన ఇద్దరు రీటైలర్లకు కూడా న్యాయస్థానం జరిమానా విధించింది.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ మ్యాగీ న్యూడుల్స్ శాంపిల్స్ ను సాధారణ జరిగే అహార న్యాణ్యత ల్యాబ్ టెస్టుల్లో మరోమారు విఫలమైంది. 2015లో ఏడు శాంపిల్ లను సేకరించిన అధికారులు అప్పుడే లక్నోలోని ల్యాబ్ కు టెస్టింగ్ కోసం పంపారు. కాగా దీనిపై నివేదిక మాత్రం 2016లో వచ్చింది. నివేదికలో వచ్చే క్రమంలో దీనిపై ఏడు కేసులు కూడా షాజహాన్ పూర్ న్యాయస్థానంలో దాఖలయ్యాయి. రిపోర్టులలో అహార న్యాణత్య జరిపిన అధికారులు మ్యాగీ నూడుల్స్ లో నాణ్యతా ప్రమాణాలు అంతగా లేవని తేల్చింది.

దీంతో ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్‌పూర్‌ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి తీర్పును వెలువరిస్తూ నెస్ట్లీ ఇండియా సంస్థకు రూ. 45 లక్షలు , డిస్ట్రిబ్యూటర్లు రూ.11 లక్షలు, రీటైల్ అమ్మకం దారులకు రూ. లక్ష చోప్పున ఇద్దరికీ జరిమాన విధించారు. అయితే ఈ ఘటన మాత్రం తాజాగా చోటుచేసుకన్నది కాదు. 2015లో మ్యాగీ నూడుల్స్ లో సీసం వాడకం అధికంగా వుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఏకంగా ఐదు నెలల పాటు మ్యాగీ నూడుల్స్ పై నిషేధాన్ని విధించిన క్రమంలో చోటుచేసుకున్నదే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maggim nestle  lab test  failed  contaminated samples  shahjahanpur  uttarpradesh  

Other Articles