Sale of smart cards commences from march స్మార్ట్ కార్డుతో ఎంటీసీ, మెట్రో అనుసంధానం.. ఒకే కార్డుపై పయనం

Smart cards makes mtc metro travel easy from march

chennai, chennai metro rail, metro transport services, chennai metro, smart cards, single card, passengers benificiary, metro rail and bus services

After repeated debates The chennai metro transport services officials and metro rail officials had entered into an agreement that passengers can travel in mts and metro rairl on one single smart cards, which will be availabe from march

స్మార్ట్ కార్డుతో ఎంటీసీ, మెట్రో అనుసంధానం.. ఒకే కార్డుపై పయనం

Posted: 11/27/2017 11:27 AM IST
Smart cards makes mtc metro travel easy from march

హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవం అయ్యేందుకు ఇంకా మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న తరుణంలో.. ఇప్పటికే ఈ రైలుకు సంబంధించి ప్రత్యేకలకు సంబంధించి అనేక కథనాలు తెరపైకి రాగా, హైదరాబాద్ లో అర్టీసీ, ఎంఎంటీసీ సర్వీసులతో పాటు మెట్రో రైలు ప్రయాణాన్ని కూడా అనుసంధానం చేసేలా ఒకే స్మార్ట్ కార్డును అందుబాటులోకి తీసుకువస్తామని కూడా ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే చెన్నైలో మాత్రం అధికారులు మరో ముందడుగు వేశారు.

ఇకపై తమిళనాడు రాజధాని చెన్నైలో అనునిత్యం ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాలపై తిరిగే ప్రయాణికులకు ఎట్టకేలకు శుభవార్తను అందజేశారు. మెట్రో రైళ్లతో పాటు ఎంటీసీ బస్సుల్లోనూ ఒకే ఒక్ స్మార్ట్ కార్డుపై ప్రయాణించేలా ప్రయాణికులకు వీలుకల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం మార్చి నుంచి అమలులోకి రానుందని అధికారులు వెల్లడించారు. ఈ విషయమై మెట్రోరైలు సంస్థ అధికారులు, మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్టు అధికారులు మధ్య పలుసార్లు జరిగిన చర్చలు ఫలించాయి.

చెన్నై మెట్రోరైలు సంస్థ నిర్వహణ డైరెక్టర్‌ పంకజ్ కుమార్ మాట్లాడుతూ... ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు మెట్రోరైళ్లు, ఎంటీసీ బస్సుల్లోను ప్రయాణించేలా ‘స్మార్ట్ కార్డు’ను ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. ఇందుకోసం ఉభయ సంస్థల అధికారులు జరిపిన చర్యలు ఫలించగా, ప్రయోగాత్మకంగా నిర్వహించి పరిశీలన విజయవంతం అయిందని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పరికరాల తయారీకి చేపట్టామని, మార్చి నుంచి ఈ పథకం అమలులోకి రానుందని అన్నారు. ఈ కార్డులను ఎటీఎం కార్డుల ద్వారా రీఛార్జి చేసుకొనే సౌకర్యం ఉందని ఆయన తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles