Rs 1 cr for slaping Tej Pratap: BJP leader ఆయన చెంప చెల్లుమనిపిస్తే రూ.కోటి..

Rs 1 cr for whoever slaps lalu yadav s son tej pratap announces bjp leader

Bihar BJP leader, Rs 1 crore reward, Rs 1 crore for slapping Tej Pratap, Lalu Yadav, Tej Pratap Yadav, RJD, BJP, objectionable comments, Bihar Deputy Chief Minister, Sushil Kumar Modi, Anil Sahni, BJP's Patna media in-charge, disciplinary action

A BJP leader Anil Sahni announced a "reward" of Rs one crore to anyone who slaps RJD leader Tej Pratap Yadav for his objectionable comments against Bihar Deputy CM Sushil Kumar Modi.

ఆయన చెంప చెల్లుమనిపిస్తే రూ.కోటి..

Posted: 11/25/2017 03:11 PM IST
Rs 1 cr for whoever slaps lalu yadav s son tej pratap announces bjp leader

దేశ రాజకీయాల్లో దాడుల సీజన్ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకు అగ్రనేత పక్షాన దిగువస్థాయి నేతలు, కార్యకర్తలు ఫలానా చేస్తే ఫలానా ప్రతిఫలం అందిస్తామన్న ప్రకటనలు పోయి.. ఏకంగా అగ్రనేతలే దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. అర్జేడీ పార్టీకి రెండు కళ్ల మాదిరిగా వున్న లాలూ కుమారులలో చిన్నవాడైన తేజస్వీ యాదవ్ డిఫ్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు నిర్వహించారు.

అయితే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కొడుకు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్ కు మాత్రం సినీరంగంపైనే మక్కువ ఎక్కువ. ఆ మద్య శ్రీకృష్ణుడి అవతారం ధరించి ఏకంగా ప్రధాని నరేంద్రమోడీనే మెప్పించాడు తేజ్ ప్రతాప్. అలాంటి తేజ్ ప్రతాప్ చెంప పగులగొట్టిన వారికి కోటి రూపాయల నజరానా ఇస్తానని బీహార్ బీజేపీ మీడియా ఇన్ ఛార్జ్ అనిల్ సాహ్ని ప్రకటించారు. దీంతో బీహార్ వ్యాప్తంగా పెను కలకలం రేపుతోంది.

బీహార్ బీజేపీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ అక్రమాలను బయటపెడతానని, ప్రజలందరి ముందు ఆయన చెంప పగుల కొడతానని తేజ్ ప్రతాప్ యాదవ్ హెచ్చరించారు. అంతటితో ఆగని ఆయన డిసెంబర్ 3న సుశీల్ కుమార్ మోదీ కుమారుడు ఉత్కర్ష్ వివాహానికి ఆహ్వానం అందిందని, ఒకవేళ తాను దానికి హాజరైతే అక్కడ రచ్చరచ్చేనని ప్రకటించారు.

ఈ నేపథ్యంలో... మోదీపై దాడి చేస్తానని తేజ్‌ చెప్పాడని, అతను దాడి చేయడానికి ముందే ఆయపై దాడి చేసిన వారికి కోటి రూపాయలు బహుమతిగా ఇస్తామని అనిల్ సాహ్ని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలతో కలకలం రేగింది. దీంతో ఆయన వ్యాఖ్యలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, వీటిపై వివరణ కోరామని, ఆయన వివరణ సహేతుకంగా లేని పక్షంలో క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని పార్టీ ప్రకటించింది. అలాగే లాలూ తన కుమారులను అదుపులో పెట్టుకోవాలని బీజేపీ సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tej pratap yadav  anil sahni  RJD  sushil kumar modi  BJP  politics  bihar  

Other Articles