Couple tie knot at police station in Kannauj బంధువుల మధ్య కయ్యం.. ఠాణాలో కళ్యాణం

Couple tie knot at police station in kannauj

Kannauj couple ties knot in police station, UP couple ties knot in police station, new couple, police king heart, tie, police station, Marriage, Knot, Groom, Bride, Kannauj, Uttar Pradesh

In a bizarre way of conducting marriage ceremony, a couple in Uttar Pradesh’s Kannauj tied knot at a police station. The incident took place, when some of the family members of the bride and groom went into frenzy during the marriage ceremony.

బంధువుల మధ్య కయ్యం.. ఠాణాలో కళ్యాణం

Posted: 11/25/2017 12:45 PM IST
Couple tie knot at police station in kannauj

ఏడేడు జన్మల బంధంగా జరిగే కళ్యాణంలో ఏ చిన్న వివాదం రేగకుండా సజావుగా సాగితే.. హమ్మయ్య అంటూ అటు అమ్మాయి తరపు వారితో పాటు ఇటు అబ్బాయి తరపు వారు కూడా ఊపిరి పీల్చుకుంటారు. అలా కాకుండా ఏ చిన్న అభిప్రాయబేధం వచ్చానా.. ఇక ఆ కళ్యాణ వేదికలో కయ్యానికి కాలుదువ్వే వారి సంఖ్య అధికంగానే వుంటుంది. ఎంతలా అంటే ఓకానోక దశలో కాబోయే బంధువుల మధ్య కత్తులు.. తుపాకీల కాల్పులు కూడా వినిపించే ప్రమాదముంటుంది.

అయితే అంతలా కాకపోయినా.. ఓ చిన్న గొడవ ఓ వివాహంలో రచ్చ చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిండు మనస్సులో ఆ జంటకు పెళ్లి చేయాలని భావించారు. అయితే వేదికగా వున్న కళ్యాణ మండపం కాస్తా మారిపోయి.. ఠాణాయే వేదికైంది. అగ్నిహత్రం, పురోహితుడు, వేద మంత్రాలు, మంగళవాయిద్యాలు లేనప్పటికీ పోలీసుల కరతాళా ధ్వనులే అన్నింటినీ మైమరింపజేశాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ లోని ఖనౌజ్ జిల్లాలో నవజంటకు వివాహం జరుగుతుండగా వధువరుల బంధువుల మధ్య వివాదం రేగింది.

వధూవరుల కుటుంబ సభ్యులు కొట్లాటకు దిగారు. అంతే వధూవరూలిద్దరూ కల్యాణ మండపం నుంచి పోలీసుస్టేషనుకు వెళ్లారు. వివాహ వేడుకలో జరిగిన గొడవతో పెళ్లిని రద్దు చేసుకోవాలని వధువు తల్లిదండ్రులు భావించారు. అంతలో పోలీసులు రంగప్రవేశం చేసి వరుడి తండ్రిని అదుపులోకి తీసుకొని వధూవరుల కుటుంబసభ్యులతో మాట్లాడి వధువరులకు పెళ్లి చేసి.. కథ సుఖాంతం చేశారు. పోలీసులు చప్పట్లతొనే వధూవరులిద్దరిని ఆశీర్వదించారు. పోలీసుస్టేషనులో జరిగిన పెళ్లి వీడియో కాస్తా ట్విట్టర్ లో పెట్టడంతో అది కాస్తా వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : new couple  police king heart  tie  police station  Marriage  Knot  Groom  Bride  Kannauj  Uttar Pradesh  

Other Articles