UIDAI admits aadhar leakage వ్యక్తిగత గోప్యతకు ఏదీ రక్షణ.?

210 govt websites leaked aadhaar data uidai admits

Aadhaar data leak, Unique Identification Authority of India, Aadhaar, Data privacy, data security, personal data

Personal details of several Aadhaar users were made public on over 200 central and state government websites till now,

వ్యక్తిగత గోప్యతకు ఏదీ రక్షణ.?

Posted: 11/20/2017 12:05 PM IST
210 govt websites leaked aadhaar data uidai admits

ప్రభుత్వ సంక్షేమ ఫలాలను దేశ ప్రజలల్లో అర్హులందరికీ చేర్చాలన్న సదుద్దేశ్యంతో అధార్ నెంబరును అనుసంధానిస్తున్న క్రమంలో.. లబ్ది పొందినవారే మళ్లీ మళ్లీ ప్రభుత్వ ఫలాలను నియంత్రించేందుకు ఇది కేంద్రం వేసిన మంచి అలోచన అంటే దేశ ప్రజలనుంచి హర్షం వ్యక్తమవుతున్న క్రమంలోనే విమర్శలు కూడా తెరపైకివస్తున్నాయి. ఓ వైపు దేశం కేంద్రం తలపెట్టిన నోట్ల రద్దు వ్యవహరం మాదిరిగానే ఈ అనుసంధాన ప్రక్రియ ప్రసహనం సాగుతుందని విమర్శలు వినబడుతున్నాయి.

నోట్ల రద్దుపై కేంద్రం, ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన మాటలను స్వాగతించి.. హర్షం వ్యక్తం చేసిన ప్రజలు.. అదే నోట్లు రద్దును సమయం మారినకొద్ది విమర్శించడం ప్రారంభించారు. సరిహద్దులో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల అటలు మునుపటికంటే తీవ్రమయ్యాయాని.. ఇక నల్లధనం కుబేరులు క్యూలైనల్లో గంటల తరబడి, రోజుల తరబడి నిల్చోకున్నా వారి డబ్బు మాత్రం పూర్తిగా కొత్తనోట్లకు మారిపోయిందని, నోట్ల రద్దు తరువాత జరుగుతున్న ఏసీబీ దాడులు, అదాయపన్ను దాడులు దేశంలోని అవినీతిని కూడా ప్రశ్నిస్తున్నాయన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ క్రమంలోనే ప్రభుత్వ పథకాలకు అధార్ కార్డు అనుసంధానం విషయమై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ సాగుతున్న నేపథ్యంలో ఇదివరకే న్యాయస్థానం వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అని తేల్చిచెప్పిన క్రమంలో.. ఈ కేసు విచారణ లోపుగానే అన్నింటికీ అధార్ ను అసునంధానం చేయాలని కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఈ క్రంమలో దేశప్రజలను విస్మయానికి గురిచేసే విషయం బహిర్గతం కావడంతో ప్రజల్లో అందోళన వ్యక్తమవుతుంది.

అదేంటంటే నోట్ల రద్దు వ్యవహారంలో ఇంటి దొంగల ( కొందరు బ్యాంకు ఉద్యోగులు, పలువరు ట్రెజరీ ఉద్యోగులు) ప్రమేయం బయటపడినట్లుగానే.. అధార్ డేటా విషయంలోనే అలాంటిదే జరిగిందని స్పష్టమైంది. దేశప్రజలకు చెందిన అనేక మంది వ్యక్తిగత వివరాలు.. ఏకంగా 200 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వెబ్ సైట్లలోనే లీక్‌ అయ్యాయి.  దాదాపు  200​​కిపైగా  వెబ్ సైట్లలో ఆధార్‌ డేటా లీక్‌ అయింది. వీటిలొ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థలతో పాటు పలు విద్యాసంస్థలు ఉన్నాయని స్వయంగా ఉడాయ్ సంస్థ అంగీకరించింది. దీంతో దేశ ప్రజల్లో అందోళన తీవ్రస్తాయిలో వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aadhaar data leak  UIDAI  Aadhaar  Data privacy  data security  personal data  

Other Articles