Vegetable prices skyrocketing in city కూర‘గాయాలు’ ఎట్ల మండుతున్నయంటే..

After tomato onion now carrot price spike pinches household budgets

onion price spike, tomato price spike, carrot price spike, household budgets, incessant rains in, price hike, vegetable prices, vegetable prices in pune, pune vegetable prices, vegetables cultivation, agriculture

Prices of vegetables continue to be high and unaffordable for the common man as the prices of almost all kinds of vegetables have gone up in market.

కూర‘గాయాలు’ ఎట్ల మండుతున్నయంటే..

Posted: 11/16/2017 03:05 PM IST
After tomato onion now carrot price spike pinches household budgets

కూరగాయల ధరలెట్ల మండుతున్నయంటే .. అరె అటు కాశ్మీరు, పంజాబ్, పూణే, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, అస్పోం, భువనేశ్వర్, ముంబై, అహ్మదాబాద్, హిమాచల్ ఏ రాష్ట్రామెళ్లినా.. ఏ నగరంలో చూసినా.,. సామాన్యుడి జేబు మాత్రం గుల్లకాక తప్పడం లేదు. అసలు కూరగాయలు కోనేందుకు సామాన్యుడు ఎన్ని అవస్థలు పడుతున్నాడో అర్థంకాకుండా పోయింది. కూరగాయల ధరలు అకాశాన్నంటుతున్న క్రమంలో సామాన్యులు అవి లేకుండానే పూటలు గడుపుతున్నారు.

మొన్న ఘాటు కన్న ధరతోనే కన్నీళ్లు పెట్టించిన ఉల్లి.. తల్లిని కాకుండా తననే మరిపించేలా చేసింది. ఆ తరువాత అదే బాటలో కొంతకాలం క్రితం టమాటా కూడా నడిచింది. కొన్నాళ్లు వంటింట్లోకి వెళ్లేందుకు కూడా బాధపడిన మహిళలు.. పచ్చళ్లు, పప్పులతోనే పూటలు గడిపేశారు. అయితే తాజాగా అదే బాటలో క్యారెట్ కూడా నడుస్తుంది. మొన్నటి వరకూ కిలో క్యారెట్ 40 రూపాయిలు పలికితే.. ఇప్పుడు సెంచరీకి దగ్గరలో ఉంది. క్యారెట్ దిగుబడి బాగా తగ్గడంతో మార్కెట్లో  రేట్లు భారీగా పెరిగాయి. రిటైల్ మార్కెట్ లో కేజీ క్యారేట్ సెంచరీ దాటింది. దీంతో క్యారెట్ కొనాలంటేనే సామాన్యుడు భయపడుతున్నాడు.

మొన్నటి వరకూ రైతు బజార్లో కిలో క్యారెట్ 35 రూపాయలకు కాస్త అటు ఇటుగా ఉండేది. ఇప్పుడు కేజీ క్యారెట్ 70 రూపాయిలకు పైనే ఉంది. పోనీ రేటుతో రాజీ పడి కొందామన్నా క్వాలిటీ లేని క్యారెట్ మార్కెట్లో ఉంది. ఇక రిటైల్ మార్కెట్లో కేజీ క్యారెట్ వంద రూపాయలు పలుకుతోంది.  దీంతో షుగర్ పేషెంట్స్ క్యారెట్ జ్యూస్ తాగడం ఇబ్బందిగా మారింది. రేటు పెరగడంతో క్యారెట్ కర్రీతో పాటు స్వీట్ కు దూరంగా ఉండాల్సి వస్తుందంటున్నారు జనం.

క్యారెట్ దిగుబడి భారీగా తగ్గడంతో మార్కెట్లో స్టాక్ కనిపించడం లేదు. అరకొరగా మార్కెట్లోకి వచ్చినా అది కూడా క్వాలిటీ ఉండటం లేదు. మొన్నపడిన వర్షాలకు క్యారెట్ సాగు దెబ్బతిందని చెబుతున్నారు రైతులు. ధర ఎక్కువగా ఉండటంతో పాటు క్వాలిటీ లేకపోవడంతో క్యారెట్ అమ్మడమే మానేశామంటున్నారు వ్యాపారులు. పంట దిగుబడి తగ్గి ధరలు పెరిగాయని వ్యాపారులు అంటుంటే..వర్షాలు పడటంతో నష్టపోయామని రైతులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : onion  tomato  carrot  household budgets  incessant rains in  price hike  Retail Market  

Other Articles