Eating too fast may lead to weight gain, heart disease అలా బోజనం చేనేవారికి షాకింగ్ న్యూస్..!

Eating too quickly may up risk of heart disease stroke and diabetes

Healthy eating, Diabetes, Obesity, Heart disease, Stroke, Metabolic syndrome, American Heart Association, AHA, health news, Eating quickly

People who eat slowly are less likely to become obese or develop metabolic syndrome, a cluster of heart disease, diabetes and stroke risk factors, according to preliminary research

అలా భోజనం చేసేవారికి షాకింగ్ న్యూస్..!

Posted: 11/16/2017 12:50 PM IST
Eating too quickly may up risk of heart disease stroke and diabetes

కొంతమంది గబగబా తినేస్తూవుంటారు. అందులోనూ మగవారు మాత్రం ఈ విషయంలో మరింత వేగాన్ని అందుకుంటారు. కాళ్లు కడుక్కుని బొజనానికి కూర్చేంటే.. ఆ తడి అరే లోపు బోజనాన్ని ముగించాలన్న పాత నానుడులను గుర్తుకు తెచ్చుకుని మరీ పోటీ పడి లాగించేస్తుంటారు. అదేంటి నీ ముందుర వున్నది నీవు కాక మరెవరైనా లాక్కుని తింటారా..? ఏంటీ అన్న ప్రశ్నలు చూసేవారిలో ఉత్పన్నమయ్యేలా కొందరి బోజనశైలి వుంటుంది. అయితే అలా బోజనం చేసేవారికి షాకింగ్ న్యూస్ ఇది.

ఇలా గబగబా బోజనం చేసేవారికి రక్తపోటు, స్థూలకాయం, మధుమేహంతో పాటుగా గుండెజబ్బుల ముప్పు పొంచివుందని హిరోషిమా యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. దీంతో గడగబా తినేవారిని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. బోజనమైనా, లేక మరేదైనా త్వరత్వరగా లాగించేవారు ఇలాంటి అనారోగ్యాల భారిన పడతారని పరిశోధకులు సూచిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. ప్రతి ముద్దనూ ఆస్వాదిస్తూ.. ప్రశాంతంగా తినేవారికి అన్నిరకాలుగా ఆరోగ్యం బాగుంటుందని చెబుతున్నారు.

మధ్య వయస్కులైన వెయ్యిమందిలో కొందరు గబగబా తినేవారితో పాటు నెమ్మదిగా అస్వాధించే వారని, అంతకన్నా తృఫ్తిగా అస్వాదించేవారిపై ఐదేళ్లపాటు జరిపిన పరిశోధనలో తాము ఈ విషయాన్ని కనుగోన్నామని తెలిపారు. అయితే వారిలో నెమ్మదిగా ఆహారం తినేకునేవారు అన్ని రకాలుగా అరోగ్యకరంగా వుండగా, వేగంగా తినేవారికి ఒబెసిటి, హై బీపీ, బ్లడ్‌ షుగర్‌, కొలెస్ట్రాల్‌ ముప్పు ఐదున్నర రెట్లు అధికంగా వున్నాయని అధ్యయనంలో తేలిందని అన్నారు.

వేగంగా తినేవారిలో రోగాలబారినపడే ప్రమాదం 11.6 శాతమైతే, కాసింత వేగంగా తినేవారికి 6.5 శాత మే ఉంటుందని హిరోషిమా వర్సిటీ పరిశోధకుడు తకయుకి యమజి వెల్లడించారు. స్పీడుగా తింటే శరీరంలో గ్లూకోజ్‌ ఒడిదుడుకులు ఏర్పడి.. ఇన్సులిన్ పై ప్రభావం పడుతుందని చెప్పారు. కంగారుగా తింటూపోతే.. వాళ్లు ఏం తింటున్నారో శరీరం గుర్తించడానికి సమయం ఉండదనీ, దీంతో ఇంకా ఎక్కువ తినేస్తారని తెలిపారు. బరువు తగ్గాలనుకుంటే మెల్లగా నమిలి తినాలంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles