massive fire accident at annapurna studios అన్నపూర్ణా స్డూడియోలో భారీ అగ్ని ప్రమాదం..

Fire at annapurna studios engulfs manam set

fire at annapurna studios, fire engulfs annapurna studio, film set engulfs at Annapurna Studios, Annapurna studios, fire accident, jubilee hills, fire tenders, hyderabad, Telangana, Crime

In an unfortunate incident, today a film set at Annapurna Studios in Jubilee Hills got engulfed in flames. It is believed that a short circuit has caused fire and it spread in no time, bringing the whole set down to ashes.

అన్నపూర్ణా స్డూడియోలో భారీ అగ్ని ప్రమాదం..

Posted: 11/13/2017 08:17 PM IST
Fire at annapurna studios engulfs manam set

హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో గల అన్నపూర్ణ సూడియోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇవాళ సాయంత్రం స్థానికంగా షూటింగ్ జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఉవ్వెత్తున్న వ్యాపించాయి. ఈ ప్రమాదంలో జెమినీ టీవి నిర్వహించే బోల్ బేబి బోల్ సెట్ తో పాటుగా రెండు సినిమా సెట్టింగులు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు అగ్నిమాపక దళాలకు సమాచారం అందించారు.

దీంతో వెంటనే ఆరు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. సినిమా సెట్టింగ్గులో జరిగిన విద్యుద్ఘాతంతోనే ఈ ప్రమాదం సంభించిందని ప్రాథమిక సమాచారం. అధికారులు కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారీగా మంటలు ఎగిసి పడుతుండటంతో స్టూడియో ఏరియాలో ట్రాఫిక్ జామయ్యింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

అటు రవీంద్రభారతిలోనూ...

నగరంలోని రవీంద్ర భారతిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడున్న వారంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రవీంద్ర భారతి సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Annapurna studios  fire accident  jubilee hills  fire tenders  hyderabad  Telangana  Crime  

Other Articles