Woman Kills in Dangerous Accident at Kothapet | కొద్ది రోజుల్లో పెళ్లి... కొత్త పేటలో ప్రమాదం.. యువతి ఘోరంగా చనిపోయింది

Kothapet road accident young woman died

Saroornagar Accident, Kothapet Road Accident, Ayurvedic Medicine Student Geetha, Geetha Died in Road Accident, Geetha Sabarinath, Geetha Died

Ayurvedic Medicine Student killed in a Dangerous Road Accident at Saroornagar. Geeta Sport Died. Recently her marriage was fixed.

ITEMVIDEOS:కొత్త పేటలో ప్రమాదం.. యువతి దుర్మరణం

Posted: 11/11/2017 10:42 AM IST
Kothapet road accident young woman died

మరో పది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి విగత జీవితగా మారింది. శుక్రవారం రాత్రి కొత్త పేట-హయత్ నగర్ మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. మృతురాలిని ఖమ్మంకు చెందిన గీతగా గుర్తించారు.

గీత(21) ఆయుర్వేద మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతోంది. సూర్యాపేటకు చెందిన శబరినాథ్ తో ఈ నెల 24న ఆమెకు వివాహం నిశ్ఛయించారు. ఇరు కుటుంబాల వాళ్లు పెళ్లి బట్టలు కొనడానికి నగరానికి వచ్చారు. శుక్రవారం రాత్రి కొత్తపేటలోని ఓ వస్త్ర దుకాణంలో షాపింగ్ పూర్తి చేసుకున్నారు. ఆపై హయత్ నగర్ లోని బంధవుల ఇంటికి వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. కొత్తపేట దగ్గర మెట్రో ఫిల్లర్ నుంచి యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో గీత బైక్ నుంచి కింద పడింది.

అప్రమత్తం అయ్యే లోపు వెనుకాల నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఆమె తలపై నుంచి వెళ్లింది. అలా పది మీటర్లు లాక్కెల్లిన టిప్పర్ ఆగిపోగా.. డ్రైవర్ పరారయ్యాడు. గీత అక్కడికక్కడే మృతి చెందగా.. శబరినాథ్ కు స్వల్ఫ గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గీత మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా విలపించారు. మరో పదిరోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన గీతకి అప్పుడే నిండు నూరేళ్లు నిండిపోయాయా అంటూ కుటుంబ సభ్యులు విలపించడం చుట్టుపక్కల వారినీ కంటతడిపెట్టించింది.

ఘటనపై కేసు నమోదుచేసుకున్న సరూర్ నగర్ పోలీసులు.. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.కాగా, గతంలో ఇదే స్థలంలో ఓ కారు ఫిల్లర్ ను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ప్రమాదకరంగా ఉన్న మలుపును డివైడర్ తో మూసేయాలంటూ పలువురు విజ్నప్తి చేసినా అదికారులు పట్టించుకోవట్లేదంటూ స్థానికులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles