RSS worker blows up roof while making bomb ఆరెస్సెస్ కార్యకర్తకు బాంబులతో పనేంటి..? పేలుడుతో ఉలిక్కిపాటు..

Oh shed in kannur rss worker blows up roof while making bomb

hindu terrorism, actor kamal hassan, actor prakash raj, controversial statements, Valayangadan Raghu, Rashtriya Swayamsevak Sangh, RSS, Kannur, Koothuparamba, gun power, thiruvananthapuram, kerala, crime

An explosion took place on the property of RSS worker Valayangadan Raghu in Kannur's Koothuparamba area, allegedly while he was making a bomb in his shed. The explosive that went off was a country-made bomb.

RSS కార్యకర్తకు బాంబులతో పనేంటి..? పేలుడుతో ఉలిక్కిపాటు..

Posted: 11/10/2017 10:54 AM IST
Oh shed in kannur rss worker blows up roof while making bomb

తమిళనాడుకు చెందిన ప్రముఖ విలక్షణ నటుడు కమల్ హాసన్.. ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాక్యలకు కేరళలో చోటుచేసుకున్న ఘటన నిదర్శనంగా నిలుస్తుందా.. అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అయనకు మద్దతుగా నిలిచిన మరో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. కూడా ఈ వ్యాఖ్యలను బలపర్చడంతో అసలు నిజంగా హిందూ ఉగ్రవాదం కూడా వుందా..? అన్న విధంగా ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అసలు ఈ అనుమానాలకు తావెందుకోచ్చిందంటే..

కేరళ రాష్ట్రంలోని కన్నూరు జిల్లా కోతుపరంబా పట్టణం శివార్లలో ఆరఎసఎస్ కార్యకర్త తన షెడ్డులో బాంబు తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. కోతుపరంబా పట్టణానికి చెందిన రఘు కేంద్రంలోని బీజేపి ప్రభుత్వానికి అనుసంధానంగా నడిచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్త తనకు చెందని నిర్మానుష్య ప్రాంతంలోని షెడ్డులో  దొంగచాటుగా సంఘవిద్రోహకరమైన నాటుబాంబును తయారు చేస్తున్నా క్రమంలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది.

ఈ ఘటనలో అతిని షెడ్డు పైకప్పుపై వుండే పెంకులన్నీ ఎగరిపడ్డాయి. కిటికీలు ధ్వంసమయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి రఘుపై కేసు నమోదు చేశారు. సంఘటన స్థలంలో నుంచి 500 గ్రాముల గన్ పౌడరును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త రఘుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రఘుతోపాటు అతని కుమారుడు పరారీలో ఉన్నారని వారి కోసం తాము గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.

బాంబు తయారు చేస్తుండగా పేలుడు జరిగిందని పోలీసులు చెప్పారు. అయితే అరెస్సెస్ కార్యకర్తగా సంఘంలో సముచిత స్థానం వున్న రఘు దొంగచాటుగా నాటుబాంబును ఎందుకు తయారు చేయాల్సి వచ్చిందన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. కాగా, గతేడాది ఒక బీజేపి కార్యకర్త కూడా బాంబులు తయారు చేస్తూ పేలుడు సంభవించడంతో మరణించాడు. ఈ ఘటన కొత్తుపురంబా పట్టణంలోనే సంభవించడం.. తాజాగా రఘు ఇల్లు కూడా ఇలానే ధ్వంసం కావడంతో.. కమల్, ప్రకాష్ రాజ్ వివాదాస్పద అరోపనణలకు బలం చేకూరుతుందన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles