ys Jagan challenges chandrababu on Paradise Papers చంద్రబాబుకు జగన్ సవాల్.. రాజకీయాల నుంచి తప్పుకుంటా

Will quit politics if you prove paradise allegations challenges jagan

YS Jagan Praja Sankalpa Yatra, Praja SankalpaYatra, Paradise Papers, Paradise Papers Leak, Chandrbabu Naidu, AP Government, leader of opposition, YSRCP, TDP, Congress, panama papers, politics

The AP Leader of Opposition, YS Jagan Mohan Reddy threw an open challenge to Chief Minister Chandrababu Naidu on the recent paradise papers’ leak.

చంద్రబాబుకు జగన్ సవాల్.. రాజకీయాల నుంచి తప్పుకుంటా

Posted: 11/08/2017 05:07 PM IST
Will quit politics if you prove paradise allegations challenges jagan

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏకంగా సవాల్ విసిరారు. తొలిసారగా ఆయన ప్యారడైజ్ పేపర్లపై స్పందిస్తూ.. చంద్రబాబుకు తాను 15 రోజుల సమయం ఇస్తున్నాన‌ని, త‌న‌కు విదేశాల్లో ఒక్క పైసా ఉందని చూపించినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని జ‌గ‌న్ అన్నారు. ఒక వేళ చంద్ర‌బాబు నిరూపించ‌లేక‌పోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా? అని ప్ర‌శ్నించారు. ప్యారడైజ్ పేపర్ల లీక్ పై ప్రస్తావిస్తూ జగన్ ఆ విధంగా అన్నారు.

తాను పాదయాత్ర చేప‌ట్టిన నేప‌థ్యంలో కొంద‌రు ఉద్దేశ‌పూర్వ‌కంగానే తన పేరుతో త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారని ఆరోపించారు. త‌నపై ఇలాంటి ప్రచారాలు చేయడం చంద్ర‌బాబుపై భ‌జ‌న చేసే మీడియాకు అల‌వాటైపోయింద‌ని అన్నారు. త‌నకు నిజంగా విదేశాల్లో డబ్బుంటే తాము నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడిపోయేవాళ్లమా? అని  ఆయ‌న అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఓట్ల కోసం చంద్రబాబు డ‌బ్బులు పంచార‌ని జ‌గ‌న్ ఆరోపించారు.

త‌మ‌ ఎమ్మెల్యేలకు రూ. 30 కోట్ల‌ నుంచి, 40 కోట్లు ఇచ్చి చంద్ర‌బాబు నాయుడు టీడీపీలోకి తీసుకుంటున్నార‌ని, ఆయ‌న‌కు అంత డ‌బ్బు ఎలా వ‌చ్చింద‌ని జ‌గ‌న్ నిలదీశారు. ఆంధ్ర‌జ్యోతి పేప‌ర్‌ చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు తెలుపుతూ త‌న‌కు వ్య‌తిరేకంగా వార్త‌లు రాస్తోందని, నంద్యాల ఉప ఎన్నికల సమయంలో బీజేపీతో తాను కలిసి నడవబోతున్నానని కూడా కట్టు కథలు అల్లి కథనం ప్రచురించిందని మండిప‌డ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ys jagan  chandrababu  panama papers  paradise papers  Praja Sankalpa Yatra  politics  Andhra pradesh  

Other Articles