Jagan Name Appears in Paradise Papers ‘పనామాలో బాబు మిత్రుడు’,, ‘పారడైజ్ లో వైఎస్ జగన్’

Jagan s padayatra begins as his name appears in paradise papers

Paradise Papers, Panama Papers, YS Jagan, Praja sankalpam, India, Tax haven, Bermuda law firm, Appleby, ICIJ

Paradise Papers has emerged embracing several biggies and politicians including Opposition Leader, YS Jagan Mohan Reddy, a report in Popular Media Papers revealed.

‘పనామాలో బాబు మిత్రుడు’,, ‘పారడైజ్ లో వైఎస్ జగన్’

Posted: 11/06/2017 12:28 PM IST
Jagan s padayatra begins as his name appears in paradise papers

ప్రపంచ నల్లకుబేరుల జాబితాలో వీరికి స్థానం వుందంటూ గత ఏడాదిన్నర క్రితం పనామా పేపర్ల ద్వారా లీకులను విడుదల చేసిన సంస్థ ఇండియన్ కాన్సోర్టియమ్ అప్ ఇన్విస్టిగేటివ్ జర్నలిస్ట్ (ఐసిఐజే) తాజాగా వెలుగులోకి తీసుకువచ్చిన ప్యారడైజ్ పేపర్ల పత్రాలలో భారతీయులు సంఖ్య ఏకంగా 719గా వుందన్న విషయాన్ని ఇప్పటికే బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే గతంలో విడుదల చేసిన పనామా పేపర్లలో కూడా వున్న ప్రముఖులు పేర్లు తాజా ప్యారడైజ్ పేపర్లలోనూ వున్నాయని స్పష్టం కావడంతో అనేక మంది భారత నల్లకుబేరుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి

దేశ ప్రజల సోమ్మును బ్యాంకుల నుంచి రుణాలుగా పోంది.. వాటిని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన అర్థిక నేరస్థుడు విజయ్ మాల్యా పేరు కూడా ఈ జాబితాలో వుండగా, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సహా ఎందరెందరో వున్నారన్న విషయాన్ని కూడా బాహాటంగానే చెప్పేసింది. ఇక ఇటు నవ్యాంధ్ర ప్రదేశ్ కు చెందిన అధికార పార్టీ చంద్రబాబు నాయుడి మిత్రుడు, అతని కుటుంబ వ్యాపారమైన హెరిటేజ్ సంస్థలో డైరెక్టర్ మోటపర్తి శివరామవరప్రసాద్ పేరు మూడు పర్యాయాలు జాబితాలో వున్న విషయం తెలిసిందే.

ఆయనకు ఎంపీ హోల్డింగ్స్ అసోసియేట్స్ లిమిటెడ్, బ్యాలీవార్డ్ లిమిటెడ్, బెట్ కెమీ వెంచర్స్ లిమిటెడ్ సంస్థలతో సంబంధమున్నట్లు పనామా పేపర్లు బయటపెట్టాయి. బిట్రీష్ వెర్జిన్ ఐల్యాండ్స్, ఇసేల్ అప్ మమ్యాన్, ఈక్వేడార్, ఘనా, పనామా తదితర దేశాలలో వ్యాపార లావాదేవీలు వున్నట్లు కూడా పనామా పేపర్లు బయటపెట్టాయి. కాగా ప్యారడైజ్ పేపర్లు మాత్రం ఏకంగా నవ్యాంధ్ర విఫక్ష పార్టీకి చెందిన వైఎస్ జగన్ పేరునే వెలుగులోకి తీసుకువచ్చింది.

అంతర్జాతీయ నల్లధన కుబేరుల జాబితాలో వైఎస్ జగన్ కూడా వున్నారని తాజాగా ఫ్యారడైజ్ పేపర్లు వెల్లడిస్తున్నాయి. పనామా పేపర్ల మాదిరిగానే ప్యారడైజ్ పేపర్లపై ఇన్వెస్టిగేషన్ జరిపిన ఇండియన్ ఎక్స్ ప్రెస్ సంస్థ వీటిపై వరుస కథనాలను ప్రచురించనున్నట్టు ప్రకటించింది. ఈ బిగ్ డేటా ప్రస్తుతం భారత రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. 'యాంటీ బ్లాక్ మనీ డే'ను నిర్వహించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైన తరుణంలో, ఈ బిగ్ డేటా విడుదల కావడం చర్చనీయాంశంగా మారింది.

బెర్ముడాస్ న్యాయ సలహాల సంస్థ అప్లీబీ, సింగపూర్స్ ఆసియాసిటీలు సంస్థలు సంయుక్తంగా ప్రపంచ నల్లకుబేరులకు తమ ధనాన్ని దాచుకునేందుకు స్వర్గధామాలైన ప్రాంతాలను సంస్థలను ప్రతిపాదించే పనిలో వుంటాయని, అయితే వీటికి సంబంధించిన పేపర్లు లీక్ కావడంతో అందులో భారతీయుల పేర్లు కూడా వున్నాయి. వాటిలోనే వైసీపీ అధినేత జగన్ పేరు కూడా ఉండటం ఆ పార్టీ శ్రేణులకు షాక్ ఇచ్చే అంశమే. ఈ అంశాన్ని టీడీపీ నేతలు తమకు అనుకూలంగా మలచుకోబోతున్నారు. ఓ వైపు పాదయాత్రలో జగన్ ప్రజల్లోకి వెళ్తుండగా, ఇప్పడీ అంశమే టీడీపీ నేతలకు కలిసివచ్చే బ్రహ్మాస్త్రంగా అంశంగా మారనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Paradise Papers  Panama Papers  YS Jagan  Praja sankalpam  India  Tax haven  Bermuda law firm  Appleby  ICIJ  

Other Articles