YS Jagan Long walk to power starts | ప్రజా సంకల్ప యాత్ర.. కాసేపట్లో ప్రారంభం

Ys jagan praja sankalpa yatra details

YS Jagan, Praja Sankalp Yatra, YSR Congress Party, YS Jagan Mohan Reddy, YS Jagan Padayatra

YS Jagan all set to embark on his 3000 KM long Padyatara in Andhra Pradesh. Jagan to start a statewide 3000 KM long 'Praja Sankalp Yatra' on November 6th to set the tone of upcoming state election.

జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం

Posted: 11/06/2017 09:49 AM IST
Ys jagan praja sankalpa yatra details

సుదూర పాదయాత్రకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంద్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభమైంది. ప్రజా సంకల్ప యాత్ర పేరిట 13 జిల్లాల పర్యటనకు బయలుదేరారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, నవ రత్నాలను(గతంలో ప్రకటించిన మానిఫేస్టో)ప్రజల్లోకి తీసుకెళ్లి.. వారి నుంచి మార్పులు, సలహాలు తీసుకోవటం, తద్వారా ఎన్నికల నాటికి సిద్ధం కావటం ఈ యాత్ర ఉద్దేశం అని స్వయంగా వైఎస్ జగన్ ప్రకటించారు. నేటి నుంచి(నవంబర్ 6) మొత్తం ఆరు నెలల పాటు సాగే యాత్ర కడప నుంచి శ్రీకాకుళం దాకా మొత్తం 3 వేల కిలో మీటర్లు, 125 కిలో మీటర్లు సాగనుంది.

తొలుత ఇడుపులపాయలోని ఆయన తండ్రి సమాధి వద్దకు చేరుకుని నివాళులర్పించారు. తల్లి విజయమ్మ ఆశీర్వాదం.. సోదరి షర్మిల ఆప్యాత కౌగిలింత, భార్య-పిల్లలకు వీడ్కోలు పలికి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అనంతరం కాస్త దూరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు చేరుకుని అక్కడ హాజరయ్యే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు పెద్ద ఎత్తున్న వైఎస్సాఆర్ సీపీ శ్రేణులు పాల్గొంటాయి. ఆపై పాదయాత్ర అధికారికంగా ప్రారంభమవుతుంది.

మధ్యాహ్నం వీరన్నగట్టుపల్లెకు చేరుకుని, అక్కడ భోజనం చేసి కాసేపు విరామం తీసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి వేంపల్లె క్రాస్‌ వద్ద ఉన్న బ్రిడ్జి సమీపం వరకు పాదయాత్ర చేస్తారు. దీంతో నేటి పాదయాత్ర పూర్తవుతుంది. ఈ విధంగా ఆయన తొలిరోజు మొత్తం 8 కిలో మీటర్ల దాకా సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలిరోజు పాదయాత్రలో వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కలిసి 30 మంది హాజరవుతారని, పార్టీ శ్రేణులు భారీగా తరలివస్తాయని వైఎస్సార్సీపీ అంచనా వేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles